కోడి కూర వండలేదని భార్యను హత్య చేసిన భర్త..!

దసరా పండగ రోజు కోడి కూర వండలేదని భార్యను భర్త హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన సన్నయ్య మద్యానికి బానిస అయ్యాడు. దసరా పండగ రోజు అంటే ఆదివారం ఫుల్ గా మద్యం తాగివచ్చాడు. వచ్చి భార్య సీతమ్మ(38)ను కోడికూర వండమని చెప్పాడు. 

అయితే ఆమె కోడికూర వండలేదు. దీంతో సన్నయ్య కోపోద్రిక్తుడయ్యాడు. ఆవేశంలో భార్యను కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లిపోయాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Leave a Comment