గర్భిణీ భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన భర్త..!

121
Hiv Injection

విడాకుల కోసం ఓ భర్త అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. తన గర్భిణీ భార్యకు హెచ్ఐవీ రోగికి ఉపయోగించిన సూదితో ఇంజెక్షన్ చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 

వివరాలు మేరకు మహేశ్ గౌతమ్ అనే వ్యక్తి అలీగఢ్ లోని ఓ ఆస్పత్రిలోని ల్యాబ్ లో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. మహేశ్ కి గత ఏడాది డిసెంబర్ లో ఓ యువతితో పెళ్లి జరిగింది. అయితే మహేశ్ మాత్రం ఆస్పత్రిలో పనిచేస్తున్న సహ ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లకు ఈ విషయం భార్యకు తెలిసి అతడిని నిలదీసింది. అప్పటి నుంచి విడాకులు కావాలని వేధిస్తున్నాడు. దీనికి భార్య అంగీకరించలేదు. 

ఈక్రమంలో ఓ హెచ్ఐవీ రోగికి ఇచ్చిన సూదితో భార్యకు ఇంజెక్షన్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె తండ్రికి తెలియజేయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురు అత్తమామలతో పాటు ఆస్పత్రి యజమాని కూడా ఈ కుట్రలో భాగస్వాములను ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను గర్భవతి అని తెలిసినప్పటి నుంచి భర్త తనకు హెచ్ఐవీ అంటించాలని చూస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు మహేశ్, అతడి తల్లిదండ్రులు, ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. 

    

 

Previous articleట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్తున్న ప్రభాస్.. ఏమైందో తెలుసా..?
Next articleరూ.5 తక్కువ ఇచ్చాడని.. వ్యక్తిని దారుణంగా కొట్టిన హోటల్ యజమాని..వీడియో వైరల్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here