గ్రేటర్ హైదరాబాద్ లో హంగ్.. రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ..!

ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరపడింది. జీహెచ్ఎంసీ ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 56 డివిజన్లలో విజయం సాధించింది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం తాను అనుకున్న టార్గెట్ రీచ్ అయింది. టీఆర్ఎస్ కు ధీటుగా సీట్లను గెలుచుకుంది. బీజేపీ 49 స్థానాలను కౌవసం చేసుకుని గ్రేటర్ లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక పాతబస్తీలో తిరుగులేని ఎంఐఎం 43 స్థానాలను గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకుంది.

అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో హంగ్ ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంతో 150 డివిజన్లలో 99 డివిజన్లు దక్కించుకున్న టీఆర్ఎస్ ఈ సారి హవా కొనసాగించలేకపోయింది. కేవలం 56 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ సారి టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. గతంలో కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈ సారి 49 డివిజన్లలో గెలుపొందింది. ఎంఐఎం మాత్రం తన డివిజన్లను పదిలంగా ఉంచుకంది. గతంలో 44 స్థానాల్లో గెలుపొందగా.. ఈసారి ఒక డివిజన్ కోల్పోయి 43 స్థానాలలో విజయం సాధించింది. 

  

Leave a Comment