విడాకుల తర్వాత భారీ సెలబ్రేషన్స్.. ఆహ్వాన పత్రిక ఇదే..!

మీరు చాలా వెడ్డింగ్ కార్డులు చూసి ఉంటారు. అందులో పాల్గొని కూడా ఉంటారు.. కానీ విడాకుల ఆహ్వాన పత్రిక ఎప్పుడైనా చూశారా? అసలు విడాకుల వేడుక గురించి ఎప్పుడైనా విన్నారా? కానీ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ ఎన్టీవో అలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.. విడాకులు తీసుకున్న 18 మంది పురుషుల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భార్యల నుంచి విడిపోవడానికి చాలా కాలం పాటు కోర్టులో విడాకుల కేసును పోరాడాల్సి వచ్చింది. అనంతరం వారి వివాహాన్ని రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది.. 

దీంతో భోపాల్ లోని ‘భాయ్ వెల్ఫేర్ సొసైటీ’ వారు ఈ విడాకుల వేడుకను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 18న భోపాల్ లో విడాకులు సెలబ్రేషన్స్ నిర్వహిస్తారు. అందుకోసం విడాకుల వేడుక ఆహ్వాన పత్రికను తయారు చేయించారు. అందులో వేడకల వివరాలను పేర్కొన్నారు. ముఖ్యంగా జయమాల ఇమ్మన్షన్, సంగీతం, సామాజిక సేవ కోసం ప్రతిజ్ఞలు, మనస్సాక్షిని శుభ్రపరిచే పవిత్రమైన అగ్ని ఆచారం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈవెంట్ సమాచారాన్ని ఆహ్వాన పత్రికలో పొందుపరిచారు. అంతేకాదు విందు కూడా ఏర్పాటు చేశారు. 

భాయ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యుడు జాకీ అహ్మద్ మాట్లాడుతూ, తమ సంస్థ మహిళలచే వేధింపులకు గురవుతున్న పురుషుల కోసం పనిచేస్తుందని వివరించారు. మహిళల కోసం ఎన్నో సంస్థలు ఉన్నాయని, మగవారి మాట వినేవారు లేరని తెలిపారు. విడాకుల సమయంలో కూడా మగవాళ్లు ఎన్నో చిత్రహింసలు భరించాల్సి వస్తుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, విడాకులు తీసుకున్న యువకుల బాధను పంచుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఆహ్వాన పత్రిక వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు పాజిటివ్ కామెంట్లు చేయడం గమనార్హం.. 

 

Leave a Comment