విద్యార్థులకు గుడ్ న్యూస్..ఫ్రీగా ల్యాప్ టాప్స్..!

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యార్థులకు ల్యాప్ టాప్స్ మరియు టాబ్లెట్స్, ఫోన్లు ఉచితంగా అందించాలని నిర్ణయించింది.  కరోనా మహమ్మారి సమయంలో విద్యార్థులు డిజిటల్ విద్యపై దృష్టి పెట్టారు. వారు క్లాసులు వినాలన్నా, కోర్సులు పూర్తి చేయాలన్నా వారికి సొంతంగా డిజిటల్ పరికరాలు అవసరం. దీని కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యలో నాలుగు కోట్ల మంది విద్యార్థులకు డిజిటల్ పరికరాలు అందించడానికి వచ్చే ఐదేళ్లలో రూ.60,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించింది. 15వ ఆర్థిక కమిషన్ కు ప్రతిపాదనలు పంపింది.  

2025-26 నాటికి భారతదేశంలో కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో చేరిన దాదాపు 40 శాతం మంది విద్యార్థులకు ల్యాప్ టాప్, టాబ్లెట్, మొబైల్ ఫోన్లు వంటి పరికరాలు అందించాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ప్రతి పరికరం యొక్క సగటు ధర రూ.15,000గా అంచనా వేసింది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.36,473 కోట్లను ఖర్చు చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. 

అంతేకాక, 2025-26 వరకు ప్రభుత్వం విద్యా ఛానల్ ‘స్వయం ప్రభా’ మరియు ఎంవోవోసీ ప్లాట్ ఫాం కోసం కోర్సులను అభివృద్ధి చేయడానికి అదనంగా రూ.2,306 కోట్లు కేటాయించాలని కోరింది. ఆన్ లైన్ విద్యను మరింత  అభివృద్ధి చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. 

Leave a Comment