Online లో EPF Withdrawal చేసుకోవడం ఎలా?

EPF (Employee’s provident Fund) అనేది ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్. ఇది అన్ని రకాల వేతనాల ఉద్యోగులకు, కార్మికులకు అందుబాటులో ఉంటుంది. ఈ నిధిని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా(ఈపీఎఫ్ఓ) నిర్వహిస్తోంది. ఇధి 20 మందికి పైగా ఉద్యోగులను కలిగిన ఏ సంస్థ అయినా ఈపీఎఫ్ఓ నమోదు చేసుకోవచ్చు. 

EPF అంటే  ఏంటి? 

ఈ పథకం కింద ఉద్యోగి తన వేతనం నుంచి 12 శాతం సమకారం చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి చెల్లించిన మొత్తానికి సమాన సమకారం సంస్థ నుంచి చెల్లిస్తారు. ఉద్యోగి పదవి విరమణ అనంతరం తను చెల్లించినా, సంస్థ చెల్లించిన మొత్తానికి వడ్డీతో సహా ఒకే మొత్తాన్ని పొందుతాడు.

EPF అకౌంట్ నెంబర్..

ఉద్యోగులు వారి EPF యొక్క స్థితి, EPF ఖాతాలోని బ్యాలెన్స్ మొదలైన వాటిని చెక్ చేసుకోవడానికి ఆర్గనైజేషన్ ఉద్యోగికి ఒక అకౌంట్ నెంబర్ ఇస్తుంది. 

EPF కొత్త రూల్…

ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం, ఉద్యోగి బేసిక్ సాలరీ రూ.15వేలు ఉంటే ఉద్యోగి 12 శాతం EPF ఖాతాకు అందిస్తాడు. ఆ ఉద్యోగి పని చేసే సంస్థ అందుకు సమానం సహకారం అందిస్తుంది. ఒక వేళ బేసిక్ రూ.15వేలకు మించి ఉంటే అప్పుడు EPF సహకారం రూ.15వేలలో 8.33శాతంగా లెక్కించబడుతుంది. 

EPF విత్ డ్రా చేయడం ఎలా?

EPF అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవడానికి ఉద్యోగి నిరుద్యోగి అయి ఉండాలి లేక పదవి విరమణ అయినా చేసి ఉండాలి. అప్పుడే EPF ఖాతా నుంచి డబ్బు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగి అయిన నెల తరువాత EPF అకౌంట్ నుంచి 75 శాతం డబ్బులు తీసుకోవచ్చు. మరియు రెండు నెలల తరువాత మిగిలిన 25 శాతం డబ్బులు పొందేందుకు  మీరు EPF ఉపసంహరణ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో నింపి ద్వారా ఉపసంహరణ దావా వేయవచ్చు. దీని కోసం మీ UAN నెంబర్ కు ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అనుసంధానం చేయబడి ఉండాలి.

EPF Withdrawal Online Procedure…

మీరు EPF Withdrawal ఆన్ లైన్ లో ఏ విధంగా నింపాలో, ఎలా Withdrawal చేసుకోవాలో తెలుసుకునేందుకు కింద స్టెప్స్ ఫాలో కండి. 

  • మొదటగా మీ UAN నెంబర్ ద్వారా UAN Member Portal లో సైన్ ఇన్ కావాలి. 

  • సైన్ ఇన్ అయిన తరువాత మెను బార్ లో ‘Online Services’ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత మీరు Claim(Form-31,19 & 10C) మీద క్లిక్ చేయాలి. 

  • అక్కడ సభ్యుని వివరాలు డిస్ల్పే మీద కనిపిస్తాయి. బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ వద్ద మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ యొక్క చివరి 4 అంకెలు ఎంటర్ చేేసి Verify అనే బటన్ పై క్లిక్ చేయాలి. 

  • అక్కడ మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు YES బటన్ పై క్లిక్ చేసి Proceed for Online Claim అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.

  • తరువాత ఆన్ లైన్లో విత్ డ్రా చేసుకోవడం కొసం ‘PF Advance (Form 31)’ ను సెలెక్ట్ చేసుకోవాలి. 

  • ఇక్కడ ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏ ప్రయోజనం కోసం, ఎంత మొత్తాన్ని ఉపసంహరించుకోవాలి మరియు ఉద్యోగి చిరునామా తదితర వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 
  • సర్టిఫికేషన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ Submit చేయాలి. 
  • మీ ఏ ప్రయోజనం కోసం ఫాం నింపారో దానికి సంబంధించి స్కాన్ చేసిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 
  • మీ యజమాని మీ ఉపసంహరణ అభ్యర్థనను ఆమోదించాలి, ఆ తరువాత మీ ఇపిఎఫ్ ఖాతా నుండి డబ్బు ఉపసంహరించబడుతుంది మరియు ఉపసంహరణ ఫారమ్ నింపే సమయంలో పేర్కొన్న బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది.
  • EPFO లో నమోదు చేయబడిన మీ మొబైల్ నంబర్‌కు SMS నోటిఫికేషన్ పంపబడుతుంది. దావా ప్రాసెస్ చేయబడిన తర్వాత, ఆ మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. EPFO చేత అధికారిక కాలపరిమితి అందించబడనప్పటికీ, డబ్బు సాధారణంగా 15-20 రోజుల్లో జమ అవుతుంది.

Leave a Comment