డబ్బు ఆదా చేయడం పిల్లలకు ఎలా నేర్పాలి?  

చిన్నప్పటి నుంచి పిల్లలకు మంచి అలవాట్లను నేర్పాలి. దీని వల్ల వారు పెద్దయ్యాక అనేక ఆచరణాత్మక సమస్యలను ఎదుర్కోవడానికి అవి సహాయపడతాయి. అలాంటి ఒక సమస్య డబ్బు ఆదా చేయడం. దీని గురించి బాల్యం నుంచే పిల్లలను నేర్పించాలి. 

బాల్యంలో చిక్కుకున్న అలవాటు జీవితాంతం మీతోనే ఉంటుందని అంటారు. కాబట్టి చిన్న వయస్సు నుంచే డబ్బు ఆదా చేసే గుణాన్ని ఎందుకు చెప్పకూడదు…వారు దీనిని బాగా నేర్చుకుంటే డబ్బు నిర్వహణలో వారికి ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే వారికి డబ్బు ఆదాతో పాటు ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలో ఒక అవగాహన ఉంటుంది. ఈ లక్షణాలను పిల్లలకు ఎలా నేర్పాలో తెలుసుకుందాం..

పిగ్గీ బ్యాంక్ తో ప్రారంభించండి..

పిల్లలకు పిగ్గీ బ్యాంకు ఇవ్వండి మరియు ఇందులో ఎంత డబ్బు పెడితే అంతా వారిదే అని చెప్పండి. ప్రతి నెలా వారికి పాకెట్ మనీ ఇవ్వండి. మరియు ఆ మొత్తంలో కొంత భాగాన్ని పిగ్గీ బ్యాంకులో ఉంచండి. క్రమంగా దానిని నింపడం వల్ల పిల్లలు సంతోషంగా ఉండటమే కాకుండా పొదుపు నాణ్యతను కూడా నేర్చుకుంటారు. 

పొదుపు వడ్డీ..

పొదుపుపై బ్యాంకులు కూడా వడ్డీ ఇస్తాయి. అదేవిధంగా మీరు పిగ్గీ బ్యాంకులో ఆదా చేసిన డబ్బుపై చిన్న వడ్డీ కూడా ఇస్తే..అది పిల్లలకు పెద్ద విషయం అవుతుంది. అది డబ్బు ఆదా చేయడానికి వారిని మరింత ప్రోత్సహిస్తుంది. 

షాపింగ్ సమయంలో..

షాపింగ్ కోసం జాబితాను తయారు చేసేటప్పుడు, దాని కోసం బడ్జెట్ కూడా నిర్ణయించబడుతుందిద. పిల్లల కోసం ఇలాంటి బడ్జెట్ ను సెట్ చేయండి. షాపింగ్ రోజున వారు ఎంత ఖర్చు చేయాలో చెప్పండి. వాస్తవానికి పిల్లల మనస్సు తరచుగా షాపింగ్ కు వెళ్తుంది. వారు ఎన్నో తీసుకోవాలని పట్టుబడుతుంటారు. ఈ పరిస్థితుల్లో పిల్లలు ఎంత మొత్తాన్ని ఖర్చు చేయాలో వారికి తెలిస్తే.. దాని ప్రాధాన్యతను వారు స్వయంగా నిర్ణయిస్తారు. ఆ సమయంలో ఎంత కావాలి మరియు ఎంత ఖర్చు చేయాలి అనే తేడాను కూడా గుర్తిస్తారు. 

గోల్ సెట్ చేయండి..

పిల్లల ముందు ఒక లక్ష్యాన్ని సెట్ చేయండి. ఉదాహరణకు పిల్లలకు బొమ్మ అవసరమైతే, దానిని వారు పొందగలరని, దాని కోసం వారు డబ్బు సేకరించాల్సి ఉంటుందని చెప్పండి. లక్ష్యం నిర్దేశించినప్పుడు, పిల్లలు మోటివేట్ అవుతారు. ఇంకా వారికి కావాల్సిన బొమ్మను కొనేందుకు సేవింగ్ చేస్తారు. 

మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోండి..

పిల్లుల ఎక్కువగా తమ తల్లిదండ్రుల నుంచే చాలా నేర్చుకుంటారు. మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేసి, మీ పిల్లలు సేవింగ్ చేయాలంటే అది అసాధ్యం. ముందుగా మీరు డబ్బు ఆదా చేయడం ప్రారంభిస్తే మిమ్మల్ని వారు అనుసరిస్తారు. ఇది ప్రతి తల్లదండ్రులు గుర్తించుకోవాల్సిన విషయం. అయితే ఇక లేట్ ఎందుకు..ఇప్పటి నుంచే మీ పిల్లలకు డబ్బు ఆదా చేయించడం నేర్పించండి మరీ..

Leave a Comment