పొగొట్టుకున్న ఆధార్ కార్డు తిరిగి పొందడం ఎలా?

How to Retrieve Lost Aadhar UID/EID

ఆధార్ కు సంబంధించిన సేవలను పొందడానికి ప్రజలు తరచుగా వారి ఆధార్ ప్రత్యేక గుర్తంపు సంఖ్య (UID) లేదా ENROLLMENT iDENTIFY (EID)ను తప్పుగా గుర్తు పెట్టుకోవడం లేదా మరిచిపోవడం జరుగుతుంది. 

పోగొట్టుకున్న లేదా మరిచిపోయిన UID/EIDని తిరిగి పొందడానికి UIDAI కొత్త సేవతో ముందుకు వచ్చింది. దీని కొసం, స్థానికులు ఆన్ లైన్ లేదా mAadhar ద్వారా UID/EIDని సులభంగా పొందవచ్చు. 

UID/EIDని పొందే విధానం..

  1. Uidai.gov.in లింక్ పై UIDAI యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
  2. ‘My Aadhar’ టాబ్ కింద ‘పొగొట్టుకున్న లేదా మర్చిపోయిన UID/EIDని తిరిపి పొందండి’ ని క్లిక్ చేయండి.
  3. కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
  4. మీరు UID/EIDని తిరిగి పొందాలనుకునే ఆప్షన్ ను ఎంచుకోండి.
  5. అవసరమైన విధంగా మీ ఆధార్ నంబర్ /EIDని ఎంటర్ చేయండి.
  6. పూర్తి పేరు, మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ మరియు captcha codeను ఎంటర్ చేయండి.
  7. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు OTP లేదా TOPT పంపబడుతుంది.
  8. అందుకున్న OTPని ఎంటర్ చేయండి. POST CONFIRMATION, ఆధార్ నబంర్ లేదా EID మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీకి పంపబడుతుంది. 

NOTE : ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ లేని వారు  UID/EID తిరిగి పొందడానికి సమీపంలోని ఎన్ రోల్మెంట్ సెంటర్ ను సంప్రదించాలి.

Leave a Comment