మనం బ్యాంకుకు వెళ్లకుండానే సులభంగా ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ను ఇంట్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. ఆధార్ సాయంతో ఆన్ లైన్ అకౌంట్ తెరిచే సదుపాయాన్ని ఎస్బీఐ తిరిగి తీసుకొచ్చింది. Yono App నుంచి సులభంగా బ్యాంక్ అకౌంట్ తెరుచుకోవచ్చు. పేపర్ రహిత తక్షణ డిజిటల్ సేవింగ్స్ ఖాతా ఇన్ స్టా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ను పాన్, ఆధార్ సాయంతో ప్రారంభించుకోవచ్చని ఎస్బీఐ పేర్కొంది.
ఈ అకౌంట్ లో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. బ్యాంకుకు రాకుండానే సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలన్నీ పొందవచ్చు. ఇన్ స్టా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు బేసిక్ రూపే ఏటీఎం-డెబిట్ కార్డును జారీ చేస్తారు.
అకౌంట్ ఎలా తెరుచుకోవాలి…
- ఇన్ స్టా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కోసం కస్టమర్లు తమ ఫోన్ లో Yono App ఇన్ స్టాల్ చేసుకోవాలి.
- పాన్, ఆధార్ వివరాలను నమోదు చేయాలి.
- వన్ టైమ్ పాస్ వర్డ్ ను సమర్పించాలి.
- తర్వాత అక్కడ అడిగిన ఇతర వివరాలు నమోదు చేయాలి.
- అనంతరం వారి అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.
- తర్వాత ఖాతాదారులు ఎస్బీఐ బ్యాంక్ శాఖకు వెళ్లి కేవైసీకి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వడం ద్వారా ఆ ఖాతాను ‘ఫుల్ కేవైసీ’ అకౌంట్ గా మార్చుకోవచ్చు.