Aadhar నంబర్ ను లాక్ / అన్ లాక్ చేయడం ఎలా?

How to Lock/Unlock Aadhaar Number

Aadhar Card. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా మీకు అందించబడిన ఫొటో గుర్తింపు కార్డు. Aadhar ను UIDAI నిర్వహిస్తుంది మరియు జారీ చేస్తుంది. ఇది జనాభా మరియు కార్డు హోల్డర్ యొక్క బయోమెట్రిక్ డేటా రెండింటినీ కలిగి ఉంటుంది. వివిధ సేవలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి. దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు.

ఇక్కడ మనం మీ Aadhar నెంబర్ ను లాక్ లేదా అన్ లాక్ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాము. ఆన్ లైన్ లో  Aadhar Lock / Unlock ప్రక్రియ చాలా సులభం. ఇక్కడ దాని గురించి వివరంగా చెబుతాం. 

అయితే Aadhar  నెంబర్ ను ఎందుకు Lock / Unlock చేయాలని మీలో సందేహం రావచ్చు. మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఈ పోస్టును తప్పకుండా చదవండి. 

మీ ఆధార్ నెంబర్ ను ఎప్పుడు లాక్ చేయాలి?

ఒక వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ గోప్యత మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని UIDAI ఆధార్ నెంబర్ Lock / Unlock  ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇది మీ ఆధార్ నెంబర్ యొక్క భద్రత మరియు గోప్యతను పెంచుతుంది. 

అనధికార ఆధార్ ప్రామాణీకరణ చాలా ప్రమాదకరం. మీరు ఎప్పుడైనా ఈ సమస్యను ఎదుర్కొంటే, మీరు మీ ఆధార్ నెంబర్ ను సులభంగా లాక్ చేయవచ్చు. ఆధార్ నెంబర్ ఉపయోగించి ఆధార్ ప్రామాణీకరణను నిరోధించవచ్చు. 

మీ Aadhar  నెంబర్ ను Lock / Unlock చేయడానికి VID అవసరం..

VID అంటే వర్చువల్ ఐడీ. ఇది 16 అంకెల సంఖ్య. మీరు UIDAI యొక్క వెబ్ సైట్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా VID నెంబర్ ను సులభంగా జనరేట్ చేయవచ్చు. మీ ఆధార్ నెంబర్ ను లాక్ చేయడానికి VID అవసరం. VID లేకుండా మీరు మీ ఆధార్ నెంబర్ లాక్ చేయలేరు. 

మీ ఆధార్ సంఖ్య లాక్ అయిన తర్వాత మీరు ఆధార్ ప్రామాణీకరణు నిర్వహించడానికి మీ VIDని ఉపయోగించవచ్చు. 

మీ ఆధార్ నెంబర్ ను Lock / Unlock ఎలా?

UIDAI వెబ్ సైట్ ద్వారా ఆధార్ నెంబర్ ను లాక్ చేసే విధానం..

  • UIDAI యొక్క అధికారిక వెబ్ సైట్ www.uidai.gov.in ను సందర్శించండి.
  • వెబ్ సైట్ యొక్క నావిగేషన్ బార్ లో ‘My Aadhar’ ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
  • ‘Aadhar services’ టాబ్ వద్ద ‘Aadhar Lock / Unlock’ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. 
  • అక్కడ పర్సనల్ డిటైల్స్ వద్ద ‘Lock UID’ రేడియో బటన్ ను ఎంచుకోవాలి. అక్కడ అడగిన వివరాలు నమోదు చేయండి.(పూర్తి పేరు, యూఐడీ, పిన్ కోడ్ మొదలైనవి)
  • వివరాలు మరియు భద్రత కోడ్ ను నమోదు చేసిన తర్వాత Send OTP బటన్ పై క్లిక్ చేయండి. 
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. 
  • OTPని ఎంటర్ చేసిన సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • అంతే మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. 

UIDAI వెబ్ సైట్ ద్వారా ఆధార్ నెంబర్ ను అన్ లాక్ చేసే విధానం..

  • UIDAI యొక్క అధికారిక వెబ్ సైట్ www.uidai.gov.in ను సందర్శించండి.
  • వెబ్ సైట్ యొక్క నావిగేషన్ బార్ లో ‘My Aadhar’ ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
  • ‘Aadhar services’ టాబ్ వద్ద ‘Aadhar Lock / Unlock’ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. 
  • అక్కడ పర్సనల్ డిటైల్స్ వద్ద ‘Unlock UID’ రేడియో బటన్ ను ఎంచుకోవాలి. 
  • మీ VID మరియు భద్రతా కోడ్ ను నమోదు చేయండి. 
  • అవసరమైన వివరాలను నమోదు చేసి Send OTP బటన్ పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. 
  • OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. 
  • అంతే మీ ఆధార్ నెంబర్ అన్ లాక్ అవుతుంది. 

ఆధార్ లాక్ యొక్క ముఖ్య లక్షణాలు

  • బ్యాంకులు, టెలికం సర్వీసు ప్రొవైడర్లు మరియు ఇతర ఏజెన్సీలు ఆధార్ ప్రామాణీకరణను ఉపయోగించి వారి గుర్తింపును ధ్రువీకరించమని వినియోగదారులను అడుగుతాయి. 
  • బయోమెట్రిక్ ప్రామాణీకరణ దుర్వినియోగం కాకుండా  UIDAI లాక్ ఫీచర్ ను తీసుకొచ్చింది. 
  • బయోమెట్రిక్ అన్ లాక్ లేదా డిసెబుల్ అయ్యే వరకు బయోమెట్రిక్ పద్ధతి ద్వారా ప్రామానీకరణ సాధ్యం కాదు. 
  • ఈ సేవ కింద వినియోగదారుల వేలిముద్రలు మరియు ఐరిష్ స్కాన్ లాక్ చేయబడతాయి. 
  • ఒక వేళ మీరు మీ బయోమెట్రిక్ లను లాక్ చేయకూడదనుకుంటే, మీరు బయోమెట్రిక్ లాక్ ని నిలిపివేయవచ్చు. 

 

Leave a Comment