అమ్మాయిలు ఇంప్రెస్ అవ్వాలంటే..!

అమ్మాయిలతో మాట్లాడాలని, వారిని ఇంప్రెస్స్ చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు యువకులు.. అందుకోసం ఆమెకు విలువైన బహుమతులు ఇవ్వాలని అనుకుంటారు.. మరికొందరైతే బ్రాండెడ్ బట్టలు వేసుకుంటేనే అమ్మాయిలు మాట్లాడతారని అనుకుంటారు.. అయితే అమ్మాయిల మనసు గెలుచుకోవడానికి ఎన్నో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి.  అబ్బాయిలతో కొన్ని లక్షణాలు ఉంటె అమ్మాయిలు వెంటనే ఇంప్రెస్స్ అవుతారు.. మరి ఆ లక్షణాలు ఏవో తెలుసుకుందాం.

అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే..

  • ముందుగా మీరు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. వారితో సరదాగా మాట్లాడుతూ నవ్వించాలి. ఉన్నంతలోనే ఆకట్టుకునేలా మంచి దుస్తులు ధరించాలి.వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి..
  • అమ్మాయితో మాట్లాడేటప్పుడు తనతో ఐ కాంటాక్ట్ ఉండేలా చేసుకోవాలి. ఫోన్లో ముఖం పెట్టి చూసుకోవడమో లేదంటే ఆమె వైపు తేడాగా చూడటమో చేస్తే మీ పని గోవిందా. కాబట్టి తనవైపు చూస్తూ నవ్వుతూ మాట్లాడాలి.
  • మీరు తనతోనే కాకుండా వేరే వ్యక్తులతో ఎలా ఉంటున్నారనే విషయాన్ని అమ్మాయిలు నిశితంగా గమనిస్తారు.
  • మంచి చెప్పులు ధరించే విషయాన్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దు. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు వేసుకున్న డ్రెస్ కంటే వారు వేసుకున్న చెప్పులనే ముందుగా గమనిస్తారు. ఫ్యాషన్ పేరిట బాబోయ్ అనిపించే టాటర్డ్ షాండల్స్, పాతబడిన స్పోర్ట్స్ షూ వేసుకొని తనని కలవడానికి వెళ్లే సాహసం చేయకండి. మీరు బద్దకస్తులని తను పొరబడే అవకాశం ఉంది.
  • అమ్మాయిలకు టీజింగ్ చేయడం అంటే ఇష్టం.. అయితే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ టీజింగ్ ఎంజాయ్ చేసేలా ఉండాలి.. కానీ మిమ్మల్ని చూడగానే భయపడి పారిపోయేలా ఉండకూడదు. మీపై కోపం, అసహ్యం వచ్చేలా జోకులు వేయవద్దు.. 
  • ఇక అమ్మాయిలను ప్రశంసించే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దు. అమ్మాయికి మీరిచ్చే కాంప్లిమెంట్ ఆమెలో కాన్ఫిడెన్స్ పెంచేదిగా ఉండలి. ఆమె వ్యక్తిత్వాన్ని, లేదా అందాన్ని లేదా ఆమెలో మీరు గమనించిన మంచి లక్షణాలను ప్రశంసించండి.. 
  • అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు కొందరు నాటకీయంగా ప్రవర్తిస్తుంటారు. ఆమె గురించి పూర్తిగా తెలియకుండానే సర్ ప్రైజ్ లు ఇవ్వాలని చూస్తుంటారు. అలా అయితే ఆమె ఇంప్రెస్ అవుతారని భావిస్తారు. మీ గురించి అతిగా చెప్పుకోవడం కూడా మంచిది కాదు.. అలా చేయడం వల్ల మీపై ఇంప్రెషన్ కాకుండా.. నెగెటివ్ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది.. 

Leave a Comment