కరోనా లక్షణాలను ఎలా గుర్తించాలి?

కరోనా వైరస్..ఈ మాట వింటే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 3,82,814 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 16,578 మంది మరణించారు. 1,02,522 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఇటలీలో అత్యధికంగా 6,077 మంది ఇప్పటి వరకు చనిపోయారు. 

ఈ మహమ్మారి భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఇప్పటి వరకు భారత్ లో 511 కేసులు నమోదయ్యాయి. ఇందులో 10 మంది మరణించగా, 37 మంది పూర్తిగా కోలుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఏడు కరోనా పాజిటివ్ కేసులు బయట పడ్డాయి. తెలంగాణాలో కరోనా పాజిటిక్ కేసుల సంఖ్య 36కు చేరింది. 

కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంది?

కరోనా వైరస్ మిగిలిన వైరస్ ల మాదిరిగా గాలిలో ప్రయాణించలేదు. కాని వైరస్ బారిన పడిని వ్యక్తితో నేరుగా పరిచయం పెట్టుకుంటే మాత్రమే ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది. 

యూకే నేషనల్ హెల్త్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారం..నేరుగా పరిచయం పెట్టుకోవడం అంటే..వైరస్ బారిన పడ్డ వ్యక్తితో కనీసం మూడు కన్న తక్కువ దూరంలో 15 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండటం. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి దగ్గనప్పుడు లేదా తుమ్మినప్పడు వెలువడే తుంపర్ల ద్వారా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఈ వైరస్ ఎదైనా వస్తువుకు అంటిపెట్టుకుని సజీవంగా చాలా కాలంపాటు ఉంటుంది. చల్లని ప్రదేశాల్లో తొమ్మిది రోజుల వరకూ ఇది బతికుండే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అందకే ఎక్కడ పడితే అక్కడ వేటిని పడితే వాటిని ముట్టుకోకుండా జగ్రత్తలు తీసుకోవడ చాలా అవసరం.

దగ్గు, తమ్ములు వస్తున్నప్పుడు చేతి రుమాలు లేదా మోచేతిని అడ్డు పెట్టుకోవాలి. చేతులను కడుక్కోకుండా ముఖాన్ని ముట్టుకోకూడదు. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి దూరంగా ఉండటం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. 

లక్షణాలు..

 • వైరస్ ముందుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి సాధారణ లక్షణాలతో  దానిని గుర్తించవచ్చు. 
 • ఇది జ్వరంతో మొదలై, తీవ్రమైన పొడి దగ్గు వస్తుంది. వారం వరకూ అదే పరిస్థితి కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. 
 • సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్ గా మారుతుంది. 
 • ప్రస్తుతం ఈ వైరస్ నివారణకు ఎలాంటి ప్రత్యేక చికిత్సలు లేవు.
 • ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కరోనా వైరస్ సోకిన వ్యక్తిలో లక్షణాలు బయటపడటానికి 14 రోజుల సమయం పడుతుంది.. వైరస్ సోకిన వెంటనే ఆ లక్షణాలు కనిపించవు. ఆ సమయంలో వారితో పరిచయమైన వారికి ఈ వైరస్ సోకే ప్రమాదముంది. 
 • వృద్ధులు, ఆస్తమా రోగులకు, డయాబెటిస్, గుండె జబ్బులున్న వారిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉంది. 

 కరోనా వైరస్ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

 • ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి.
 • దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి కనీసం ఒక మీటర్ నుంచి మూడు మీటర్ల దూరంలో ఉండాలి.
 • ఈ రెండు లక్షణాలు ఉన్నవారు తుమ్మినా లేదా దగ్గినా టిష్యూ లేదా బట్ట అడ్డు పెట్టుకోవాలి. ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగాలి. 
 • ప్రయాణాల్లో షాపింగ్ సమయాల్లో, ఆఫీసుల్లో అవసరమైన ప్రతి వస్తువును చేతితో తాకుతునే ఉంటాం. ఆ సమయంలో వైరస్ సోకే అవకాశం ఉంది. అవే చేతులతో కళ్లను నలిపినా, ముక్కును, నోటిని తాకినా ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. కావున అదే పనిగా చేతులతో కళ్లను, నోరును, ముక్కును తాకవద్దు. 
 • జలువు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన జాగ్రత్తులు తీసుకోవాలి. 

కరోనా వైరస్ శరీరం మీద ఎలా ప్రభావం చూపుతుంది?

 • కరోనా వైరస్ సోకిన వ్యక్తి మనకు దగ్గరగా ఉండి దగ్గిన సమయంలో శ్వాస పీల్చినప్పుడు లేదా ఈ వైరస్ తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నప్పుడు ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. 
 • ఇది మొదటగా మన గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలో వ్యాపిస్తుంది. అక్కడి నుంచి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది.
 • ఇది ప్రాథమిక దశ. ఈ దశలో మనం అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. కొంత మందికి అసలు ఎటువంటి లక్షణాలు కనిపించవు. 
 • వైరస్ తొలుత సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంది. 
 • కరోనా వైరస్ సోకినప్పుడు ఆరంభంలో పొడి దగ్గు ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత కొందరిలో దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంది. వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటకు వస్తాయి. 
 • ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తులు తీసుకొని చికిత్స తీసుకుంటే తగ్గే అవకాశం ఉంది. వ్యాధి ముదిరిన తర్వాత ముక్కు కారటం జలుబు వంటి లక్షణాలు వస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది. 

 

 

Leave a Comment