మీకు 18 ఏళ్లు నిండాయా? కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్ట‌ర్ చేసుకోండి…

మే 1 నుంచి 18 ఏళ్ల నిండిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే దీని కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. 18 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలంటే కోవిన్ వెబ్ పోర్టల్(Cowin web portal)లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం 45 సంవత్సరాలు పైబడిన వారికిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా కోవిన్ వెబ్ పోర్టల్ లో పేరు నమోదు చేసుకోవాలన్న నిబంధన ఉంది. కానీ.. ఆధార్ కార్డుతో నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్తే వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు. అక్కడికక్కడే వివరాలు నమోదు చేసుకుంటున్నారు. 

అయితే కోవిడ్ వైరస్ సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర నిర్ణయించింది. ఈ తరుణంలో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే కోవిన్ వెబ్ పోర్టల్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 

Vaccine Registration Process : కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానం..

 • ముందుగా కొవిన్ పోర్ట‌ల్ (cowin.gov.in) లాగిన్ అవ్వండి.
 • మొబైల్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి Get OTPపై క్లిక్ చేయండి.
 • మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.. వెబ్‌సైట్‌లో ఎంట‌ర్ చేయండి.. వెరిఫై బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.
 • రిజిస్ట్రేష‌న్ ఫ‌ర్‌ వ్యాక్సినేష‌న్ పేజి ఓపెన్ అవుతుంది.
 • ఫొటో గుర్తింపు కార్డును ఎంచుకోవాలి.
 • గుర్తింపు కార్డు నంబ‌ర్‌తో పాటు పేరు, పుట్టిన సంవ‌త్స‌రం వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాలి.
 • వివరాలు పూర్తి చేశాక రిజిస్ట‌ర్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.
 • రిజిస్ట్రేష‌న్ చేసుకున్న తర్వాత ఏ రోజు టీకా వేయించుకోవాలో షెడ్యూల్ చేసుకోవాలి.
 • షెడ్యూల్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.
 • మ‌రో పేజి ఓపెన్ అవుతుంది. మీ ఏరియా పిన్ కోడ్ ఎంట‌ర్ చేయండి.
 • టీకా కేంద్రాల లిస్ట్ వస్తుంది. అందులో తేదీ, స‌మ‌యాన్ని సెలెక్ట్ చేసుకోండి.
 • క‌న్ఫార్మ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేస్తే చాలు.. మీ టీకా రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్టే…

 

Leave a Comment