ఆన్ లైన్ లో ఓటర్ కార్డును ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

How to download Voter ID card

ఓటరు ID, EPIC (ఎలెక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్) అని కూడా పిలుస్తారు. ఇది ఓటు వేయడానికి అర్హత ఉన్న భారతీయ పౌరులందరికీ భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు. ఓటరు ఐడి యొక్క ఉద్దేశ్యం ఓటర్లకు గుర్తింపు రుజువుగా పనిచేయడం, సామర్థ్యాన్ని పెంచడం మరియు స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ప్రజాస్వామ్య ఎన్నికలలో వంచన మరియు మోసాలను నిరోధించడం. ఈ కార్డును సాధారణంగా ఎన్నికల కార్డు, ఓటరు కార్డు లేదా ఓటరు ID కార్డు అని కూడా పిలుస్తారు.

ఇలాంటి ఓటర్ కార్డును మీరు పోగొట్టుకున్నారా? మీ ఓటర్ కార్డు దొరకడం లేదా?  అయితే మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. మీ ఓటర్ ఐడీ నెంబర్ కూడా అవసరం లేకుండా కేవలం మీ పేరుతో మీ ఓటర్ ఐడీ కార్డును మీ మొబైల్ లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం కింద స్టెప్స్ ను ఫాలో అవ్వండి..

How to download Voter ID card

  • ముందుగా మీరు https://www.nvsp.in వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. 
  • అక్కడ హోమ్ పేజీలో మీకు వివిధ రకాల ఆప్షన్లు ఉంటాయి. వాటిలో మీరు Search Electoral Roll ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. 
  • తర్వాత మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, వయస్సు, తదితర వివరాలు ఎంటర్ చేయాలి.

  • తరువాత కాప్చ ఎంటర్ చేసి Search అనే బటన్ పై క్లిక్ చేయాలి.
  • తరువాత అక్కడ ఒక లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. 
  • అక్కడ మీ పేరు దగ్గర క్లిక్ చేసి మీ ఓటర్ ఐడీని పొందవచ్చు. 
  • అయితే అక్కడ మీ ఫొటో అయితే రాదు. దానిని మీరు ప్రింట్ తీసుకొని వాడుకోవచ్చు. 
  • లేదా ఎన్ రోల్మెంట్ సెంటర్ వద్ద మీ ఫొటో కలిగిన ఐడి కార్డును పొందవచ్చు. 

 

Leave a Comment