JanDhan ఖాతా ఉన్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం మరో విడత రూ.500 జమ చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని పేద ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తోంది. JanDhan ఖాతాను సులభంగా ఓపెన్ చేయవచ్చు. ఒక వేళ మీ వద్ద పాత ఖాతా ఉంటే దానిని కూడా JanDhan ఖాతాగా మార్చవచ్చు. కేంద్ర ఈ సౌలభ్యాన్ని కల్పించింది. ఇప్పుడు మీ పాత ఖాతాను JanDhan ఖాతాగా ఎలా మార్చాలో తెలుసుకుందాం.
Convert Your Old Account in to Jan Dhan Account..
- మొదటగా మీ బ్యాంక్ ఖాఖకు వెళ్లండి.
- అక్కడ ఒక ఫారం నింపి రూపే కార్డు కోసం దరఖాస్తు చేయండి.
- మీరు ఫారం నింపిన తర్వాత, దానిని బ్యాంక్ లో సమర్పించండి.
- దీని తర్వాత, మీ బ్యాంక్ ఖాతా జన్ ధన్ ఖాతాగా మార్చబడుతుంది.
JanDhan ఖాతా యొక్క ప్రయోజనాలు ఏమాటీ?
JanDhan ఖాతా ఉన్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రయోజనాలను కల్పిస్తుంది. అవి ఏంటంటే?
- JanDhan ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీ లభిస్తుంది.
- లబ్ధిదారులకు ఖాతాతో ఉచిత మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం లభిస్తుంది.
- JanDhan ఖాతాదారులు ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా తమ ఖాతా నుంచి రూ.10 వేల వరకు ఉపసంహరించుకోవచ్చు. అయితే కొన్ని నెలలు JanDhan ఖాతాను సరిగ్గా నిర్వహించిన తర్వాతే ఈ సౌకర్యం లభిస్తుంది.
- JanDhan యోజన మీకు రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తుంది.
- లబ్ధిదారుడి మరణంపై అర్హత షరతులు పూర్తయిన తర్వాత లభించే రూ.30 వేల వరకు లైఫ్ కవర్ కూడా ఇవ్వబడుతుంది.
- లబ్ధిదారులు JanDhan ఖాతా ద్వారా బీమా, పెన్షన్ ఉత్పత్తులను సులభంగా కొనుగోలు చేయవచ్చు.
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు శ్రామ్ యోగి మాన్ ధన్ పథకాలలో పింఛను కోసం ఖాతా తెరవవచ్చు.
- PMJDY ఖాతాలో కనీస బ్యాలెన్స్ మెయిన్ టేన్ చేయాల్సిన అవసరం లేేదు. కానీ మీకు చెక్ బుక్ సౌకర్యం కాావాలంటే మీరు కనీస బ్యాలెన్స్ కలిగి ఉండాలి.
PMJDY కొత్త అకౌంట్ ను ఎలా తెరవాలి?
- JanDhan ఖాతా తెరవాలనుకునే వారు తమ సమీప బ్యాంకును తప్పక సందర్శించాలి.
- అక్కడ, JanDhan అకౌంట్ ఫారం నింపాలి.
- పేరు, మొబైల్ నంబర్, బ్యాంక్ పేరు, దరఖాస్తుదారుడి చిరునామా, నామినీ, వ్యాపారం/ ఉపాధి మరియు వార్షిక ఆదాయం తదితర వివరాలను నమోదు చేయాలి.
కావాల్సిన ముఖ్యమైన పత్రాలు
పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు నంబర్, ఓటర్ ఐడీ కార్డు, రాష్ట్ర ప్రభుత్వ అధికారి సంతకంతో ఎంఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు వంటి కొన్ని ముఖ్యమైన పత్రాలు JanDhan ఖాతా తెరవడానికి అవసరం..