కోపాన్ని అదుపు చేసుకోవడం ఎలా?

మనిషికి కోపం రావడం సహజం.. కానీ అదే కోపం మనిషి ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ మనం శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా ఆరోగ్యంగా ఉండాలంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం తెలుసుకోవాలి.. ఆధునిక ప్రపంచంలో ప్రజల జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. దీంతో రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యలే చాలా వరకు మనలో కోపానికి కారమణమవుతున్నాయి.  

కోపం వల్ల జీవితంలో ఎదురయ్యే పరిణామాలు:

 • కోపం వల్ల రిలేషన్ షిప్ సమస్యలు వస్తాయి. మనకు ఇష్టమైన వాళ్లతో మన సంబంధాలలో కోపం వల్ల సమస్యలు ఏర్పడతాయి. తరచూ కోపం వల్ల వాదోపవాదాలకు దారి తీస్తుంది. ఇది మన రిలేషన్ షిప్ ని పాడు చేస్తుంది. 
 • మనం పనిచేసే చోట కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. ఒక వ్యక్తి తన కోపాన్ని అదుపు చేసుకోలేనప్పుడు తన సహ ఉద్యోగులతో గొడవలవుతాయి. అది తన పనిచేసే సామర్థ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. 
 • వ్యాధి నిరోధక శక్తి తగ్గేలా చేస్తుంది. దాని వల్ల తరచూ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. 
 • తరచూ కోపం రావడం అనేది గొడవకి సిద్ధపడే విధంగా హార్మోన్లు విడుదల చేస్తుంది. 
 • కోపం నిద్రలేమికి దారితీస్తుంది. 
 • కోపం మన లాజికల్ మైండ్ సరిగా పనిచేయకుండా చేస్తుంది. దాని వల్ల ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన తన అదుపులో ఉండదు. 
 • మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంది. 
 • కోపం వల్ల హార్మోన్లపై ఒత్తిడి పెరిగి టెన్షన్ పెరుగుతుంది. దీంతో హైబీపీ బారిన పడటం, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్ వంటి సమస్యలు ఏర్పడవచ్చు.

కోపం అదుపు చేసేందుకు చిట్కాలు..

 • మనసును శాంతింపజేసేందుకు దీర్ఘ శ్వాస తీసుకుంటూ 10 వరకు అంకెలను లెక్కపెట్టాలి.
 • కోపంగా ఉన్నప్పుడు శ్వాస తీసుకునే వేగం పెరుగుతుంది. అయితే మెల్లగా శ్వాస తీసుకోవడం సాధన చేయడం ద్వారా కోపం చాలా త్వరగా తగ్గుతుంది. 
 • కొద్దిసేపు ప్రశాంతంగా నడవాలి.
 • ఇష్టమైన సంగీతం వినడం ద్వారా మెదడుపై ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. 
 • యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి.
 • ఆల్కహాల్, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు తీసుకోవడం మానేయాలి.
 • మీరు కంటి నిండా నిద్రపోతున్నారా లేదా చూసుకోండి.. 
 • పుసక్త పఠనం, చిత్ర లేఖనంతోనూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.
 • ఎవరూ లేని గదిలో లేదా నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతంలో గట్టిగా అరవాలి. లేదా కేకలు వేయాలి.
 • బెడ్ మీద దిండును పిడికిలితో కొట్టాలి.  
 • దేవునికి ప్రార్థన చేయడం వల్ల మనకు ఓర్పును, మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
 • మన శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోయినా ఓపిక తగ్గి మనకు తరచూ కోపం వస్తుంది. కాబట్టి శరీరానికి అసరమైన పోషకాలు అందేలా చూసుకోండి.

  

Leave a Comment