కొత్త రైస్ కార్డు స్టేటస్ చెక్..!

మీకు రాబోయే రైస్ కార్డు స్టేటస్ ను ఆన్ లైన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలియజేయబోతున్నాము.  అసలు మీ రైస్ కార్డు మ్యాపింగ్ అయిందా ? లేదా? స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి. అలాగే ఆ రైస్ కార్డులో మీ కుటుంబ సభ్యలు ఎంత మంది ఉన్నారు..వారి పేర్లు కరెక్టుగా ఉన్నాయా ..లేదా..వారి వయస్సు కరెక్టుగా ఉందా..లేదా..అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా యాడ్ చేసింటే వారు యాడ్ అయ్యారా ..లేదా..ఎవరినైనా తీసేసి ఉంటే వారు డిలీట్ అయ్యారా.. లేరా? ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం..

స్టేటస్ తెలుసుకునే విధానం..

  • మీ రైస్ కార్డు స్టేటస్ తెలుసుకోవడానికి ముందుగా మీరు spandana.ap.gov.in లింక్ మీద క్లిక్ చేయాలి. 
  • అక్కడ మీకు స్పందన వెబ్ సైట్ కు సంబంధించిన ఒక వెబ్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. 
  • అక్కడ రేషన్ కార్డు స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 
  • దానిలో మీకు రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు నెంబుర్ ఎంటర్ చేయండి.
  • లేదా మీరు కొత్తగా అప్లయి చేసుకొని ఉంటే మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. 
  • ఆ తరువాత అక్కడ సబ్మిట్ అనే బటన్ పై క్లిక్ చేయండి ఇప్పుడు మీ రైస్ కార్డు యొక్క పూర్తి వివరాలు అక్కడ చూపించడం జరుగుతుంది. 

Rice card Active లో ఉంటే..

  • మీ రేషన్ కార్డు Activeలో ఉంటే స్టేటస్ లో మీకు Eligible అని చూపిస్తుంది. ఒకవేళ Activeలో లేకపోతే మీకు Ineligible అని చూపిస్తుంది. 
  • మీ రైస్ కార్డు Ineligible అని చూపిస్తే దానికి సంబంధించిన కారణాలు స్టేటస్ లో మీకు చూపించడం జరుగుతుంది. 
  • ఆ కారణాలను బట్టి మీరు మీ గ్రామ వలంటీర్ ను సంప్రదించి మీరు దానిని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. 

 

Click Here :- https://drive.google.com/file/d/1aiLDW1q6iGZd2cpMNFkc4rIlOyNv0Z6y/view?usp=sharing

Leave a Comment