ఆధార్ కార్డులో ఫొటో మార్చాలి అనుకుంటున్నారా?

How to Change Photo in aadhar

ఆధార్ కార్డు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు. ఆధార్ ను UIDAI(యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిర్వహిస్తుంది మరియు జారీ చేస్తుంది. ఇది జనాభా మరియు కార్డు హోల్డర్ యొక్క బయోమెట్రిక్ డేటా రెండింటినీ కలిగి ఉంటుంది. మన ఆధార్ కార్డులో తప్పులు, లేదా వ్యక్తిగత వివరాలు లేదా ఫొటోను సవరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. 

  1. సెల్ప్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్(ఎస్ఎస్ యుపి) ద్వారా.
  2. ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ ను సంప్రదించడం ద్వారా.

How to Change/Update Photo in Aadhar 

మీ సమీపంలోని ఆధార్ ఎన్ రోల్మెంట్ సెంటర్ ను సందర్శించి ఆధార్ లో వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. ఆధార్ లో ఫొటో మార్చేందుకు కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవండి.

  • సమీపంలోని ఆధార్ ఎన్ రోల్మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రాని్న సందర్శించండి.
  • UIDAI వెబ్ సైట్ నుంచి ఆధార్ నమోదు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకుని ఫారం నింపండి. 
  • అనంతరం మీ ఫారాన్ని ఎగ్జక్యూటివ్ కు అందించి మీ బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయండి.
  • ఆ తరువాత ఎగ్జిక్యూటివ్ మీ ఫొటో తీస్తారు. మీ వివరాలు ఆమోదించడానికి మీరు బయోమెట్రిక్ ను అందించాలి. 
  • వివరాలు అప్ డేట్ చేయడానికి రూ.25 ఫీజు చెల్లించాలి. 
  • అప్పుడు మీరు Update Request Number కలిగి ఉన్న రసీదు స్లిప్ పొందుతారు. 
  • Update Status స్థతిని check చేయడానికి  Update Request Number ను ఉపయోగించవచ్చు. 

Updated Aadhar download process

ఆధార్ అప్ డేట్ లో మీ రిక్వెస్ట్ ప్రొసెస్ అయిత తరువాత మీ ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు UIDAI పోర్టల్ ద్వారా అప్ డేట్ అయిన ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీరు సాధాదరణ ఆధార్ కార్డు లేదా మాస్క్డ్ ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడానికి ఎంచుకోవచ్చు. అప్ డేట్ తరువాత mAadhar అప్లికేషన్ లో మీ ఆధార్ వివరాలను కూడా రిఫ్రెష్ చేయాలి. డిజిలాకర్ యాప్ లో కూడా ఆధార్ డేటాను అప్ డేట్ చేయాలి. 

Important points Related to Aadhar card Update

ఆధార్ కార్డులో ఫొటో మార్చేందుకు ఎటువంటి సర్టిఫికెట్లు అవసరం లేదు. ఎగ్జిక్యూటివ్ వెబ్ క్యామ్ ను ఉపయోగించి అక్కడికక్కడే ఫొటోను క్లిక్ చేస్తారు. వివరాలు ఆధార్ లో అప్ డేట్ చేయడానికి 90 రోజుల సమయం పడుతుంది. రిసిప్ట్ స్లిప్ లో అందించిన URNను ఉపయోగించి మీరు ఆన్ లైన్ లో ఆధార్ అప్ డేట్ స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు. అయితే సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ ద్వారా ఆధార్ కార్డులో ఫొటోను మార్చడానికి ఆన్ లైన్ ప్రక్రియ లేదు. పై విధంగా ఆధార్ కార్డులో ఫొటోను మార్చవచ్చు. 

You might also like
Leave A Reply

Your email address will not be published.