ఆధార్ కార్డులో మీ ఫొటో నచ్చలేదా?.. సింపుల్ గా ఇలా మార్చుకోండి..!

Aadhar Card: ప్రస్తుతం ఎలాంటి సేవలు పొందాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరి. అయితే మీ ఆధార్ కార్డు తయారైనప్పటికి, ఇప్పటికీ మీ ఫొటోలో చాలా మార్పులు వచ్చింటాయి. ఆ ఫొటో గుర్తుపట్టలేనంతగా మారిపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులకు అవకాశం లభిస్తోంది. మీ ఆధార్ కార్డులో ఫొటో నచ్చకపోతే వెంటనే మార్చుకోవచ్చు. యూఐడీఏఐ(UIDAI) వెబ్ సైట్ నుంచి ఫొటో ఛేంజ్ చేసుకోవచ్చు..

ఆధార్ కార్డులో ఫొటో ఎలా మార్చుకోవాలంటే?

  • ఆధార్ కార్డు మీద ఫొటో మార్చడం కోసం ఒక ఫామ్ నింపాలి. ఆ ఫామ్ ను UIDAI వెబ్ సైట్ నుంచి సులభంగా యాక్సెస్ చేసుకుని, డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
  • మీ ఫొటోను మార్చడానికి మీరు మీ ప్రాంతంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. 
  • ఇందుకోసం అవసరమైన ఫీజు చెల్లించాలి. 
  • ఆధార్ నమోదు కేంద్రంలో సంబంధిత అధికారి మీ కొత్త ఫొటోను క్లిక్ చేసి, మీ ఆధార్ కార్డుకు అప్ లోడ్ చేస్తారు. 
  • ఆ తర్వాత నిర్ణీత వ్యవధిలోగా మీ ఆధార్ కార్డు మీద కొత్త ఫొటో వస్తుంది.

 

Leave a Comment