జుట్టు రాలుతుందా… సంరక్షణ ఎలా ? 

ఈ రోజుల్లోె మహిళల్లో కనిపించే ప్రధాన సమస్య విపరీతంగా జుట్టు రాలడం. ఈ సమస్యకు హార్మోన్ల అసమతుల్యత, అధిక మోతాదులో రసాయనాలున్న షాంపూలు, ఆయిల్స్ వినియోగం, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి కారణాలతో బాటు మానసిక ఒత్తిడి, ఆహారపరమైన మార్పులు కూడా ఈ సమస్యకు ఇతర కారణాలుగా ఉన్నాయి. ఇక చుండ్రు ఈ సమస్యకున్న మరో ప్రధాన కారణం. కారణాలు ఏవైనా కింది చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలటాన్ని నిరోధించటమే గాక, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. 

  • నూనె రాయని వారిలో కేశాలు పొడిబారి, నిర్జీవంగా అయిపోయి, తెగి, రాలిపోతాయి. అందుకే..నెలలో కనీసం నాలుగు సారైనా గోరువెచ్చని బాదం, ఆలివ్ లేదా కొబ్బరి నూనెతో తలకి మసాజ్ చేసుకోవాలి. 
  • గిన్నెలో ఆరు చెంచాల నూనె, అర చెంచా మెంతులు తీసుకుని సన్నని సెగ మీద ఐదు నిమిషాలు ఉంచాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నూనెను మునివేళ్లతో మాడకు పట్టించి, మసాజ్ చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ పెరిగి, జుట్టు రాలడం ఆగి, కేశాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. 
  • తీసుకునే ఆహారంలో ఐరన్ తగ్గినా జుట్టు రాలుతుంది. గనుక తరుచూ ఎండబెట్టిన అత్తిపండు, జీడిపప్పు, బాదం పప్పులతో బాటు లివర్, రొయ్యలు తీసుకోవాలి. దీని వల్ల తగినంత ఐరన్ అంది, జుట్టు రాలటం ఆగుతుంది.
  • వారానికి రెండు సార్లయినా మంచి కండిషనర్ తో తలస్నానం చేయడం వల్ల దుమ్ము ధూళీ తొలగి, చుండ్రు దరి చేరదు. దీని వల్ల జుట్టు రాలటమనే సమస్య తలెత్తదు. 
  • రోజూ గ్లాసు తాజా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జుట్టు రాలడం బాగా తగ్గుతుంది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తలను కప్పేలా చున్నీ ధరించడం వల్ల జుట్టు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. 
  • హెయిర్ క్లిప్స్ లేదా బ్యాండ్స్ తో జుట్టును గట్టిగా మెలిపెట్టి, కట్టడం వల్ల జుట్టు రాలుతుంది. గనుక వదులుగా మాత్రమే కట్టాలి. 
  • జుట్టు స్వభావానికి తగిన షాంపూను మాత్రమే ఎంపిక చేసుకుంటే జుట్టు రాలడం వంటి సమస్య రాదు. 
  • కేశాలకు అధికంగా జెల్ లేదా స్ప్రే వాడినప్పుడు జుట్టు దెబ్బతిని, తెగిపోయే ముప్పు ఎక్కువ. కనుక వాటిని వాడిన తర్వాత తప్పక వెంటనే తలస్నానం చేయాలి. 

Leave a Comment