వైఎస్ఆర్ పెళ్లికానుకకు దరఖాస్తు చేయడం ఎలా?

రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహాలు భారం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ పెళ్లి కానుకకు శ్రీకారం చుట్టింది. ఆడపిల్లకు పెళ్లి అయి అత్త వారింటికి వెళ్లిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు సీఎం జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వధువుకు రక్షణ కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం..

Guidelines for ysr pellikanuka : 

  1. పెళ్లికానుకకు అర్హులైన వారు మండల సమాఖ్య లేదా మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
  2. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. 
  3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లి కతురి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. 
  4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు. 
  5. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. 

Eligibility for ysr pellikanuka :

వధూవరులిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారైతే…

  1. వధువు మరియు వరుడు ఇద్దరూ ప్రజా సాధికార సర్వేలో నమోు కాబడి ఉండాలి.
  2. వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
  3. వధువు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  4. వివాహ తేదీ నాటికి వధువుకు 18 ఏళ్లు మరియు వరుడుకు 21 ఏళ్లు నిండి ఉండాలి. 
  5. కేవలం మొదటిసారి వివాహం చేసుకొనే వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే వధువు వితంతువు అయినప్పటికీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 
  6. వివాహం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరగాలి. 

వధువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండి వరుడు ఇతర రాష్ట్రాలకు (తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చత్తీస్ ఘడ్ మరియు ఒడిస్సా) చెందిన వారైతే…

  1. వధువు ప్రజా సాధికార సర్వేలో నమోదు కాబడి ఉండాలి.
  2. వధువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి.
  3. వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
  4. వధువు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. 
  5. వివాహ తేదీ నాటికి వధువుకు 18 ఏళ్లు మరియు వరుడుకు 21 ఏళ్లు నిండి ఉండాలి. 
  6. కేవలం మొదటిసారి వివాహం చేసేకొనే వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే వధువు వితంతువు అయినప్పటికీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 
  7. వివాహం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరగాలి. 

Ysr pellikanuka amount details :

 

పథకం

ప్రోత్సాహకం

Scheduled Cast (SCs)Rs.1 Lakh
Scheduled Tribes (STs)Rs.1 Lakh
SCs & STs Inter Cast MarriageRs.1.25 Lakh
Backward Classes (BCs)Rs.50,000
BCs Inter Cast MarriageRs.75,000
MinoritiesRs.1 Lakh
DisabledRs.1.5 Lakh
Construction Labour ChildrenRs.1 Lakh

 

Documents for Ysr pellikanuka :

 

ప్రమాణము

ధ్రువపత్రము

కులము/కమ్యూనిటీమీసేవ ద్వారా జారీ చేయబడిన నేటివిటీ, కమ్యూనిటీ మరియు జనన ధ్రువీకరణ త్రం ( మీసేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్)
వయస్సుSSC సర్టిఫికెట్ – 2004వ సంవత్సరం మరియు ఆ తరువాత పదో తరగతి పాసైన వారికి 

లేదా

ఇంటిగ్రేటెడ్ మీసేవ సర్టిఫికెట్

ఆదాయం ( వధువుకు మాత్రమే)తెల్ల రేషన్ కార్డు / మీసేవ ఇన్ కమ్ సర్టిఫికెట్
నివాసముప్రజాసాధికార సర్వే నందు నమోదు
అంగవైకల్యముసదరం సర్టిఫికెట్ ( కనీసం 40 శాతంగా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)
వితంతువు. ఆధార్ నెంబర్ ఆధారంగా పింఛన్ డేటాతో పరిశీలిస్తారు.

. వితంతువు అయి ఉండి పింఛన్ పొందకపోతే లేదా పింఛన్ డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత ధ్రువీకరణ

భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులుఏపీబీఓసీడబ్ల్యూడబ్ల్యూబి వారిచే జారీ చేయబడిన కార్మికుని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డు

 

YSR PELLIKANUKAకు ఎలా నమోదు చేసుకోవాలి…

వైఎస్ఆర్ పెళ్లి కానుకలో నమోదు చేసుకునే సమయానికి వివాహ వేదిక, వివాహ సమయం నిర్ణయించబడి ఉండాలి. వివాహ తేదీకి కనీసం 5 రోజుల ముందు నమోదు చేసుకోవాలి. మీ సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో వధువు తరపు వారు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న పది రోజుల వ్యవధిలో డబ్బు వధువు ఖాతాలో జమ చేయబడుతుంది.

Leave a Comment