PMKMYలో దరఖాస్తు చేయడం ఎలా?

How to apply PMKMY Online

60 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ.3వేలు పింఛన్ వచ్చేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ‘ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన’(పీఎంకేఎంవై) పథకం. చిన్న, సన్నకారు, మధ్య తరహా రైతులకు పింఛన్ అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో రైతులకు నెలకు రూ.3వేల చొప్పున ఏడాదికి రూ.36వేల పెన్షన్ వస్తుంది. ఈ పథకంలో ఏడాదికి దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మందిని చేర్చాలని కేంద్ర వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించింది. రెండో దశలో 12 కోట్ల మందిని ఈ పథకం పరిధిలోకి తీసుకురానున్నారు. 

ప్రీమియం ఎలా ?

పీఎం కేఎంవైలో పేర్ల నమోదుకు ఫీజు, ప్రత్యేకంగా డాక్యుమెంట్లు సమర్పించాల్సిన పని లేదు. రైతులు ప్రీమియంను 3, 4, 6నెలలకు ఒకేసారి చెల్లించవచ్చు. లేదా  పీఎం కిసాన్ పతకం కిందద తమ బ్యాంకు ఖాతాలో జమయ్యే మొత్తం నుంచి నేరుగా చెల్లించవచ్చు. దీని వల్ల రైతులపై భారం పడదు. అదే ఖాతా నుంచి పింఛన్ డ్రా చేసుకోవచ్చు. 

నెలకు ఎంత చెల్లించాలి..?

18 నుంచి 40 సంవత్సరాల రైతులు ఈ పథకానికి అర్హులు. రైతు వయస్సును బట్టి నెలవారీ ప్రీమియం చెల్లింపు ఉంటుంది. నెలకు చెల్లించాల్సిన కనీస మొత్తం రూ.55 కాగా గరిష్టంగా రూ.200 వరకు కట్టాలి. ఒక వేళ ఎవరైనా రైతులు ఈ పథకం నుంచి మధ్యలో వైదొలగితే అప్పటిదాకా చెల్లించిన సొమ్మును సేవింగ్స్ ఖాతాకు ఇచ్చే వడ్డీతో కలిపి తిరిగి ఇస్తారు. రైతుల పెన్షన్ నిధిని ఎల్ఐసీ పర్యవేక్షిస్తుంది. రైతులు చెల్లించే నెలవారీ ప్రీమియానికి సమనంగా ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది. ఒక వేళ ఎవరైనా రైతు మధ్యలోనే చనిపోతే భార్యకు 50 శాతం అంటే నెలకు రూ.1,500 చొప్పున చెల్లిస్తారు. 

ఆన్ లైన్ లో దరఖాస్తు విధానం..

  • ముందుగా PMKMY వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడి Click here to apply now అనే బటన్ మీద క్లిక్ చేయాలి. 
  • అక్కడ Self enrolement  అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Proceed అనే బటన్ మీద క్లిక్ చేయాలి. 
  • అక్కడ మీ పేరు, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేసుకోవాలి. 
  • అలా చేసుకున్న తరువాత ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏమైన స్కీమ్ కు అప్లయి చేసుకున్నారా? ఎన్ని సార్లు అప్లయి చేసుకున్నారు..అనే వివరాలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. 
  • ఆ పేజీలో మీకు enrolement అనే ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. అక్కడ స్కీమ్ ల చూపించడం జరగుతుంది. అక్కడ Pradhana mantri shram yogo mandhan yojana మీద క్లిక్ చేయాలి. 
  • వెంటనే మీకు ఒక కొత్త ఫారమ్ అనే ఓపెన్ అవుతుంది. అక్కడ సబ్ స్క్రైబర్ ఆధార్ నెంబర్ తో సహా కొన్ని వివరాలను నమోదు చేసి Submit బటన్ క్లిక్ చేయాలి.
  • వెంటనే మనకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో మన బేసిక్ డిటైల్స్ అనేవి ఉంటాయి. అక్కమ మన వివరాలను చెక్ చేసేకుని జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మన మొబైల్ కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. దానిని ఎంటర్ చేయాలి. 
  • అక్కడ మన వయస్సు ప్రకారం ఎంత కట్టాలనేది చూపిస్తుంది. 
  • తరువాత మన బ్యాంకు వివరాలు, నామినీ వివరాలు అడగడం జరుగుతుంది. దానిని నమోదు చేసి sumit & Proceed బటన్ మీద క్లిక్ చేయాలి. వెంటనే మీకు సబ్మిట్ సక్సెస్ ఫుల్ అనేది వస్తుంది. మీ అప్లికేషన్ ను ప్రింట్ తీసుకోవాలి. దానిలో సంతకాలు చేయాల్సి ఉంటుంది. వాటి మీద సంతకాలు చేసి ఫైల్ ను స్కాన్ చేయాలి. దానిని ఎక్కడైతే డౌన్ లోడ్ చేశారో అక్కడే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. 

website : https://pmkmy.gov.in

Leave a Comment