ఆధార్ తో 10 నిమిషాల్లో పాన్ కార్డు .. వెంటనే దరఖాస్తు చేయండి..

ఆధార్ వివరాలు సమర్పిస్తే చాలు తక్షణమే ఆన్ లైన్ లో పాన్ నంబర్ కేంటాయించే విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఆధార్ నంబర్ తో పాటు దానికి అనుసంధానమైన మొబైల్ నంబర్ ఉండి, పాన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. పూర్తిగా పేపర్ రహితంగా, ఎలక్ట్రానిక్ పాన్(ఈ-పాన్) నంబరును ఉచితంగా కేటాయించడం జరుగుతుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. పాన్ కార్డు అనే ముఖ్యమైన ఐడీ ప్రూఫ్. ఇది దేశంలోని రైతులతో సహా ప్రతి ఒక్కరికీ అవసరం. 

ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ద్వారా తక్షణ శాశ్వత ఖాతా నంబర్ సౌకర్యాన్ని ప్రారంభించినప్పటికీ ట్రయల్ ప్రాతిపదికన దాని బీటా వెర్షన్ ఫిబ్రవరి నుంచి ఐటీ విభాగం యొక్క ఈఫైలింగ్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. అప్పటి నుంచి పన్ను చెల్లింపుదారులకు 6.7 లక్షలకు పైగా తక్షణ పాన్ కార్డులు ఇవ్వబడ్డాయి. కేవలం 10 నిమిషాల్లోనే ఈ పాన్ కేటాయించారు. 

తక్షణ పాన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

  • ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తుదారు ఇన్ స్టంట్ పాన్ పొందవచ్చు. 
  • ఈ ఫైలింగ్ వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ Get New PAN వద్ద క్లిక్ చేయాలి.
  • తర్వాత ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. 
  • ఆధార్ కు అనుసంధానమైన మొబైల్ నంబర్ కు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. 
  • ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత 15 అంకెల అక్నాలెడ్ మెంట్ నంబర్ వస్తుంది. 
  • ఈ కేటాయింపు పూర్తయ్యాక ఈ-పాన్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
  • ఒక వేళ ఆధార్ తో రిజిస్టరైన మెయిల్ ఐడీ ఉంటే దానికి కూడా ఈమెయిల్ వస్తుంది. 

Leave a Comment