గుండె ఆరోగ్యానికి ఎన్ని గంటల నిద్ర అవసరమో.. చెప్పిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్..!

ప్రస్తుతం మనిషి జీవిన శైలిలో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక చాలా మంది నిద్రను చాలా లైట్ తీసుకుంటున్నారు. మనిషి జీవితంలో నిద్ర అనేది చాలా అవసరం.. ఒత్తిడి, ఆహార నియమాలతో పాటు సరైన నిద్ర లేకపోతే మనిషి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. 

తాజాగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మనిషికి ఎంత నిద్ర అవసరమో తేల్చి చెప్పింది. కంటి నిండా నిద్రపోతే ఆరోగ్యానికి ఎంతో మంచిదని స్పష్టం చేసింది. గుండె, మెదడు ఆరోగ్యవంతంగా పనిచేయడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. ప్రతి మనిషి కనీసం 7 గంటలు నిద్రపోవాలని, అది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని స్పష్టం చేసింది. 

ప్రతిరోజూ రాత్రి 7-9 గంటలు సరిపడా నిద్ర వ్యవధి అని, పిల్లలు అంతకు ఎక్కువ, ఐదేళ్లు లోపు చిన్నారులకు 10-16 గంటల నిద్రను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్స్ చేసింది. ఏఎహ్ఏ ప్రచురించిన జర్నల్ లోని హార్ట్ హెల్త్ చెక్ లిస్టులో నిద్ర వ్యవధిని కూడా చేర్చింది. మనిషికి నిద్ర ఎంతో ముఖ్యమని, సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. 

Leave a Comment