అవినీతిపరుల పాలనలో అభివృద్ధి ఎలా సాధ్యం ? – యనమల రామకృష్ణుడు

జనగ్ ఏడాది పాలనలో మూడు ప్రాతాల్లో చేసిన అభివృద్ధి శూన్యమని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. టీడీపీ చేసిన అభివృద్ధిని వైసీపీ ధ్వంసం చేస్తుందన్నారు. అభివృద్ధి చేసే వారయితే పీపీఏల జోలికి వెళ్లేవారు కాదన్నారు. ఐదు దేశాల ఎంబసీల నుంచి వార్నింగ్ లు, కోర్టుల నుంచి 70 చీవాట్లు తినేవాళ్లు కాదని విమర్శించారు. ఐదేళ్లలో టీడీపీ విశాఖకు పెంచిన ప్రతిష్టను 14 నెలల్లోనే వైసీపీ సముద్రంలో కలిపేసిందన్నారు.  భూకబ్జాదారుల గమ్యస్థానంగా విశాఖను వైసీపీ మార్చిందని ఆరోపించారు. 

14 నెలల్లో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సీఎం జగన్ చేసిన అభివృద్ధి ఏమిటీ? వైసీపీ పాలనలో రాయలసీమ నాలుగు జిల్లాల్లో జగన్ సాధించిన పరోగతి ఏంటని ప్రశ్నించారు. వైసిపి పాలనలో రాయలసీమ జిల్లాలలో ఒక్క పరిశ్రమ పెట్టారా.. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకొచ్చారా..అంటూ ప్రశ్నించారు. వాటాలు అడిగి ఎన్ని కంపెనీలను తరిమేశారని, ఎంత మంది పారిశ్రామిక వేత్తలను బెదిరించారని ఆరోపించారు. 

కియా 17ఆగ్జిలరీ యూనిట్లు తరిమేసిన మీరా అభివృద్ది గురించి మాట్లాడేది..? సోలార్ ప్లాంట్ల యజమానులను తుపాకులతో బెదిరించిన మీరా రాయలసీమను అభివృద్ది చేసేది..? కాంట్రాక్ట్ ఇవ్వలేదని, వేలాది సోలార్ ప్లేట్లు ధ్వంసం చేయడమా వైసిపి అభివృద్ది..? ప్రకాశం జిల్లాలో రూ25వేల కోట్ల ఆసియా పేపర్ అండ్ పల్ప్ ఇండస్ట్రీని పోగొట్టడమేనా వైసిపి అభివృద్ది..? అంటూ మండిపడ్డారు. 

అవినీతిపరుల పాలనలో ముఠాకోరుల(క్లిప్టోక్రాటిక్ గ్యాంగ్ స్టర్స్) చేతిలో 3 ప్రాంతాల అభివృద్ది ఏవిధంగా సాధ్యమని, 3 ప్రాంతాల్లో ప్రశాంతమైన జిల్లాలను కూడా ముఠాకోరుల అడ్డాగా మార్చి ఫాక్షనిస్టుల హస్తగతం చేయడమే వైసిపి అభివృద్ది అని విమర్శించారు. స్థానికుల ఆస్తిపాస్తులన్నీ దోచి భూ కబ్జాదారులకు కట్టబెట్టడమే వైసిపి చేసేదన్నారు. రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీలను మరిన్ని ఏర్పాటు చేయడంలో పోటీబడాలే తప్ప, ఉన్న సిఆర్ డిఏను రద్దు చేయడం అభివృద్ది అవుతుందా అంటూ ప్రశ్నించారు.. ‘‘స్వంత బాధ్యతలే తప్ప సామాజిక బాధ్యత లేని సిఎం’’గా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారని ఎద్దేవ చేశారు.

 

Leave a Comment