శ్మశానంలో హౌస్ ఫుల్ బోర్డు..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దీంతో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. ఎప్పుడు చూడని దృశ్యాలు చూడాల్సి వస్తోంది. కొత్తకొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. కోవిడ్ రోగుల మరణాలు పెరుగుతుండటం, దహన సంస్కారాలకు ఇబ్బందులు తలెత్తడం ఇటీవల దేశవ్యాప్తంగా చూస్తున్నాం.. బెంగళూరులోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. మృతదేహాల తాకిడిని తట్టుకోలేక కొన్ని చోట్ల శ్మశానల వద్ద ఏకంగా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నారు. 

కర్ణాటకలో మహమ్మారి విలయానికి ఇది పరాకాష్టగా అనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో మృతదేహాలు వస్తుండటంతో శ్మశానాలు కిటకిటలాడుతున్నాయి. దాంతో నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. ఖననం చేయలేమని తేల్చేస్తున్నారు. చామరాజ్ పేటలోని ఓ శ్మశానవాటిక వద్ద హౌస్ ఫుల్ బోర్డు తగిలించారు. బెంగళూరులో 13 విద్యుత్ దహన వాటికలు ఉన్నాయి. అన్నీ నిరంతరం బిజీగా ఉంటున్నాయి. 

 

Leave a Comment