సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. నూతన సచివాలయం నిర్మాణానికి అనుమతి కూడా ఇచ్చేసింది. సచివాలయం కూల్చవద్దంటూ వేర్వేరుగా 10 పిటిషన్లు దాఖలయ్యాయి. దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది. 

ప్రస్తుతం ఉన్న సచివాలయం శిథిలావస్థకు చేరిందని, అందులో సదుపాయాలు కూడా సరిగ్గా లేవని ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని నిర్ణయించింది. అందుకు విరుద్ధంగా కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసుకు సంబంధించి హైకోర్టు తీర్చు చెప్పింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం సచివాలయ కూల్చివేతకు అనుమతి ఇచ్చింది. 

 

Leave a Comment