తెలంగాణ సర్కార్ పై హైకోర్టు సీరియన్..

కరోనా నిర్ధారణ పరీక్షలు, రోగులకు అందుతున్న చికిత్స తీరుపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  కరోనా పరీక్షలు చేయకుండా ప్రజల జీవితాలతో చెలగాటం అడుతోందని మండిపడింది. మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని పరీక్షలు నిర్వహించారు? ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీశారు? జూన్ 26న పరీక్షలు ఎందుకు నిలిపివేయాల్సి వచ్చింది? వివరాలు సమర్పించాలని ఆదేశించింది. 

అదేవిధంగా రాష్ట్రంలో కేంద్ర బృందం ఎక్కడెక్కడ పర్యటించిందో దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 17న సమర్పించాలని చెప్పింది. డాక్టర్లు, పారమెడికల్ సిబ్బందికి ఎన్ని పీపీఈ కిట్లు ఇచ్చారో తెలపాని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 17న పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని,  దానిపై సంతృప్తి చెందక పోతే ఈనెల 20న చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్ కోర్టుకు హాజరుకావాని ఆదేశించింది. నివేదికలు సమర్పించకపోతే కోర్టు ధిక్కరణగా భావిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. 

                                                                                                        

Leave a Comment