ప్రేమకు అడ్డు వస్తున్నాడని.. సొంత తమ్ముడిని చంపించిన హీరోయిన్..!

తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని సొంత తమ్ముడిని చంపుకుంది ఓ హీరోయిన్.. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఇదం ప్రేమమ్ జీవనమ్, ఒందు గంటేయ కథ సినిమాల్లో నటించిన శనయా కాట్వే, సెలబ్రిటీ మేనేజర్ గా పనిచేస్తున్న నియాజ్ అహ్మద్ తో ప్రేమలో ఉంది. 

అయితే నియాజ్ తో శనయా తిరగడం సోదరుడు రాకేష్ కు నచ్చలేదు. దీంతో అతడికి దూరంగా ఉండాలని పలుమార్లు హెచ్చరించాడు. దీంతో తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని, అతడి అడ్డు తొలగించాలని శనయా, నియాజ్ ప్లాన్ వేశారు. అనుకున్నట్లుగా నియాజ్ తన అనుచరులతో రాకేష్ ను దారుణంగా చంపేశారు. 

తర్వాత శవాన్ని కారులో దాచిపెట్టారు. కానీ ఆ కారులో నుంచి దుర్వాసన వస్తే పోలీసులకు దొరికిపోతామని భయపడ్డారు. దీంతో రాకేష్ తల, మొండెం, కాళ్లు, చేతులను ముక్కలు ముక్కలుగా కోసం హుబ్బళిలోని తదితర ప్రాంతాల్లో విసిరేశారు. కానీ రాకేష్ కేసులు పోలీసులు చాలెంజింగ్ గా తీసుకున్నారు. నిందితుడు నియాజ్ ను ఇట్టే గుర్తించి అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో హీరోయిన్ కు కూడా సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెను కూడా అరెస్ట్ చేశారు. 

Leave a Comment