పెట్రో సెగ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మపై హీరో సిద్ధార్ధ సెటైర్లు..!

దేశవ్యాప్తంగా పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్ ధరలు కొన్ని రాష్ట్రాల్లో సెంచరీ కూడా కొట్టేశాయి. మరి కొన్ని రాష్ట్రాల్లో సెంచరీకి దగ్గరలో ఉన్నాయి. ధరల పెరుగుదల కారణంగా ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతవారం స్పందించారు. పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాల్సి ఉందని చెప్పారు. 

ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్ధ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై సెటైర్లు వేశారు. ట్వీట్టర్ వేదికగా తనదైన శైలిలో విమర్శించారు. ‘మామి తరువాతి స్థాయికి చేరుకున్నారు. ఉల్లిపాయలు లేవు, మెమోరీ లేదు, ప్రిన్సిపల్స్ లేవు, మామి రాక్స్’ అంటూ ట్వీట్ చేశారు.  

ట్వీట్టర్ లో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వీడియోను చోడించారు. ఆ వీడియోలో 2013లో నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో పెట్రో ధరలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పిన ఆమె, తాజాగా ధరల పెరుగుదలకు ఆయిల్ కంపెనీలదే బాధ్యత అని అన్నారు. ఇంధన ధరల నియంత్రణ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదని పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.  

Leave a Comment