‘పాన్ ఇండియా.. అదో నాన్సెన్స్’.. హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న పదం పాన్ ఇండియా.. ఈ పదంతో నార్త్ హీరోలకు, సౌత్ హీరోలకు మాటల యుద్ధం నడుస్తోంది.. తాజాగా పాన్ ఇండియా అంశంపై హీరో సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా అనేది అగౌరవకరమైనదని, అదో నాన్సెన్స్ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ చేసేవి అన్ని భారతీయ చిత్రాలే అయినప్పుడు పాన్ ఇండియా అని ఎందుకంటున్నారని ప్రశ్నించారు. 

15 సంవత్సరాల క్రితమే మణిరత్నం రోజా సినిమా తీశారని, ఆ సినిమాను ప్రతి ఒక్కరూ చూశారని అన్నారు. సినిమాను నచ్చిన భాషలో చూసే హక్కు ప్రేక్షకులకు ఉంటుందన్నారు. పాన్ ఇండియా అనే పదాన్ని తీసేసి ఇండియన్ సినిమా అని పేరు పెట్టాలని, లేదా ఏ భాషలో తీస్తే ఆ భాషతోనే పిలవాలని సిద్ధార్థ్ కోరారు. 

ఒక సినిమా గొప్పగా రావాలంటే ఎంతో మంది టెక్నీషియన్లు కవాలని, వారికి భాషా భేదం ఉండదని అన్నారు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా.. ఏ భాష అయినా హిట్ అవుతుందని, దానికి పాన్ ఇండియా అని చెప్పి బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదని సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్దార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 

Leave a Comment