‘అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదు’.. పెళ్లిపై స్పందించిన ప్రభాస్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. లిస్ట్ లో మొదట ప్రభాస్ పేరే ఉంటుంది. హీరో ప్రభాస్ సినిమాల్లో ఎంత బిజీ అయిపోయాడంటే.. అతని పెళ్లి గురించి ఆలోచించే తీరక కూడా లేనంతగా బిజీ అయ్యాడు.. తాజాగా ప్రభాస్ ‘రాథేశ్యామ్’ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. బుధవారం ముంబాయిలో ఈ సినిమా ట్రైలర్ ని సినిమా యూనిట్ విడుదల చేసింది. 

ఇందులో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ప్రభాస్ స్పందించారు. ప్రేమ విషయంలో విక్రమాదిత్య అంచనాలు తప్పాయి అని సినిమాలో ఓ డైలాగ్ ఉంది. మరి నిజ జీవితంలో ప్రేమ విషయంలో మీ లెక్క తప్పిందా అంటూ ఓ విలేకరి ప్రభాస్ ని ప్రశ్నించాడు. 

ఈ ప్రశ్నలకు ప్రభాస్ స్పందించాడు. ‘చాలా సార్లు ప్రేమ విషయంలో నా అంచనాలు తప్పాయి. అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదు’ అని సరదాగా బదులిచ్చాడు. పెళ్లి గురించి ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. తరుచూ యాక్షన్ సినిమాల్లో నటిస్తే ఫ్యాన్స్ బోర్ ఫీలవుతారని, అందుకే ఈ సారి ప్రేమకథతో అలరించేందుకు వస్తున్నానని.. మరో విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాగా.. ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన ‘రాథేశ్యామ్’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Leave a Comment