విమర్శకులకు సోనూసూద్ గట్టి సమాధానం..!

సోనూసూద్ కష్టం వచ్చింది అంటే చాలు..నేనున్నానని ముందుకు వచ్చాడు. అటు కరోనా కాలంలో వలస కార్మికులకు సొంతూళ్లకు పంపి దేవుడయ్యాడు. ఆ తర్వాత కూడా ఎవరైనా తాము కష్టాల్లో ఉన్నామంటే చాలా వారిని ఆదుకున్నాడు. ఇలా తనకు తోచిన కాడికి చేయూతనందించాడు. ఇంత చేసినా సోనూసూద్ ను విమర్శించేవారు లేకపోలేదు.. ఆయన చేస్తున్న సామాజిక సేవను తప్పుబడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. 

సోనూ సూద్ కూడా ఈ ట్రోల్స్ కు గట్టిగానే బదులిచ్చాడు. ఇటీవల ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఎవరు ఏం చేసిన అది తనను ప్రభావితం చయదని, తాను చేయాలనుకున్నది చేస్తానని చెప్పాడు. తాను అందరిని మోసం చేస్తున్నానని, తాను ఏం చేయలేదని విమర్శించేవారికి గట్టి సమాధానం ఇచ్చారు. 

తనను విమర్శించే వారికి ఒకటే చెప్పాలనుకుంటున్నానని, తాను ఇదంతా వారి మెచ్చు కోసం చేయట్లేదని చెప్పారు. తాను సాయం చేసిన వారి డేటా తన వద్ద ఉందని, వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. విదేశాల నుంచి తీసుకొచ్చిన విద్యార్థుల వివరాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. తనను విమర్శించే వారు దానికి బదులు బయటకు వెళ్లి ఎవరికైనా సాయం చేయాలన్నారు. ఇక తాను రాజకీయాల్లో వస్తున్నానని వస్తున్న వార్తులను సోనూసూద్ ఖండించాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 

Leave a Comment