క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి..!

ఈరోజుల్లో చాలా మంది హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. ఒకప్పుడు పెద్ద వారిలో వచ్చే గుండెపోటు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తుంది.. ఎంతో మంది యువకులు సడెన్ హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి క్రికెట్ ఆడుతూ మృతి చెందాడు ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.. 

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ కి చెందిన తుస్సార్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాజేంద్రనగర్ పరిధిలోని సన్ సిటీ ఎస్బీఐ గ్రౌండ్ లో తుస్సార్ క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హార్ట్ ఎటాక్ కారణంగానే తుస్సార్ మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.  

 

Leave a Comment