గుడ్ న్యూస్: గుండె పోటుకు మందు కనిపెట్టిన పరిశోధకులు..!

గుండెపోటు ఎప్పుడు, ఏ విధంగా వస్తుందో చెప్పలేం.. ఇది రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే మిగతా ఏ సమస్యలు వచ్చినా వాటిని చికిత్స ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ గుండె సమస్యలు వస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం..

అయితే ఈ గుండె పోటుకు పరిశోధకులు మందును గుర్తించారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. గుండె జబ్బు తర్వాత గుండెకు నష్టం జరగకుండా నిరోధించే అణువులు ఫన్నెల్ అనే స్పైడర్ విషంలో కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అంతేకాదు.. గుండె మార్పిడి జరిగిన రోగుల జీవితాన్ని కూడా ఈ విషంతో పెంచవచ్చని అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ ల్యాండ్స్(UQ) నుంచి డాక్టర్ నాథన్ పాల్పంత్, ప్రొఫెసర్ గ్లెన్ కింత్, విక్టర్ చాంగ్ కార్డియాక్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ప్రొఫెసర్ పీటర్ మెక్ డొనాల్డ్ నేతృత్వంలోని సభ్యులు ఈ ఆవిష్కరణ చేశారు.

ఇది ఎలా పనిచేస్తుంది? 

ఈ ఔషధం ఎలా పనిచేస్తుందో డాక్టర్ నాథన్ వివరించారు. సాలీడు విషంలో Hi1a అనే ప్రోటీన్ ఉంటుందని, గుండె నుంచి వచ్చే డెత్ సిగ్నల్ ఆపడానికి ఇది పనిచేస్తుందని చెప్పారు. ఇది జరిగినప్పుడు కణాల మరణాన్ని నివారించవచ్చన్నారు. దాని ప్రభావం కారణంగా గుండె కణాలు మెరుగుపడతాయన్నారు. గుండెపోటు తర్వాత నష్టాన్ని నివారించడానికి ఇచ్చే ఔషధం ఇప్పటివరకు తయారు కాలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఔషధం ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుతో బాధపడుతున్న లక్షలాది మంది రోగులకు ఉపశమనం అందిస్తుందని ప్రొఫెసర్ మెక్ డొనాల్డ్ అన్నారు. 

ఇది మాత్రమే కాకుండా.. దీని ద్వారా మరొక ప్రయోజనం ఉంటుంది. Hi1a ప్రోటీన్ సహాయంతో దాతల ద్వారా దానం చేయబడిన గుండె కణాలు మెరుగుపడతాయి.. ఈ విధంగా విజయవంతంగా గుండె మార్పిడి అవకాశాలు పెరుగుతాయి. 

ప్రొఫెసర్ గ్లెన్ కింగ్ ఒక ఫన్నెల్ వెబ్ సాలీడు విషంలో ఒక ప్రోటీన్ ను కనుగొన్నారు. ఈ ప్రోటీన్ బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత కోలుకోవడానికి సహాయపడుతుందని పరిశోధనలో వెల్లడైంది. స్ట్రోక్ వచ్చిన 8 గంటల తర్వాత రోగికి ఈ ప్రోటీన్ ఇచ్చినప్పుడు, మెదడులో జరిగే నష్టాన్ని ఇది సరిచేస్తుందని కొనుగోన్నారు. ఇక్కడి నుంచి గుండె కణాలను రిపేర్ చేయడానికి పరిశోధన కూడా ప్రారంభించారు. ఎందుకంటే మెదుడులాగే, గుండె కూడా శరీరంలో ఒక ముఖ్యమైన భాగమే..

దాని రక్త ప్రవాహంలో ఆటంకాలు, ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇది నేరుగా రోగిని ప్రభావితం చేస్తుంది. ప్రోటీన్ నుంచి తయారు చేసిన ఔషధాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. గుండె పోటు కేసుల్లో రోగికి తక్షణ చికిత్స అవసరం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ ఔషధం రోగికి ఇస్తారు. తద్వారా పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించవచ్చు. 

ఈ ఔషధం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ నివసిస్తున్న రోగులు ఆస్పత్రికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అటువంటి వారికి ఈ మందు ఇవ్వడం ద్వారా వారి గుండె నొప్పి ప్రమాదాన్ని నివారించవచ్చు. 

Leave a Comment