కరోనా సోకిందని భార్యకు అబద్ధం…ప్రియురాలితో వేరేచోట కాపురం..

ప్రియురాలి మోజులో పడి భార్యనే వదిలించుకుందామనుకున్నాడు ఓ ప్రబుద్ధడు..అందుకు కరోనాను సాకుగా చూపాడు.. తనకు కరోనా సోకిందని, చచ్చిపోతున్నానని భార్యకు చెప్పాడు. ప్రియురాలితో కలిసి ఎంచక్కా వేరే కాపురం పెట్టాడు..ఎవరికీ దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నాడు…చివరికి పోలీసులకు దొరికేశాడు…ఈ ఘటన ముంబాయిలో జరిగింది..

ముంబైలోని తలోజా ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల మనీశ్ మిశ్రాకు వివాహమై ఐదేళ్ల పాప ఉంది. ఈ క్రమంలో మనీశ్ వేరే యువతితో ప్రమలో పడ్డాడు. ఇక ఆమెతో కలిసి జీవించాలని అనుకున్నాడు.. అందుకు భార్య అడ్డుగా ఉంది. ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.. దానికి కరోనాను వాడుకోవాలనుకున్నాడు. జూలై 24న మనీశ్ తన భార్యకు ఫోన్ చేసి ‘ నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.. నేను ఇండోర్ వెళ్తున్నాను.. ఇక నాకు బతకాలని లేదు’ అని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. 

భర్త ఆ మాటలు అనేసరికి భార్య కంగారుపడిపోయింది. విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపింది. కుటుంబ సభ్యులు అతని కోసం గాలించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో వాషీ ఏరియా వద్ద బైక్, హెల్మెట్, పర్సు దొరికాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేస్ నమోదు చేసుకున్నారు. అతడి కోసం కోవిడ్-19 కేరస్ సెంటర్లు, ఆస్పత్రులు సహా అనేక ప్రాంతాల్లో వెతికారు. అయినా ఎక్కడా ఆచూకి దొరకలేదు. ఒక వేళ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానించి శవం కోసం గాలించారు. అయిన ఫలితం లేకపోయింది. 

ఈ క్రమంలో గతవారం అనూహ్యంగా అతడి ఫోన్ నెంబర్ ఇండోర్ లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తన పేరు, చిరునామా మార్చి ఇండోర్ లోని ఓ ఇంట్లో ప్రియురాలితో కాపురం పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు అతడిని అదుపులో తీసుకుని బుధవారం ముంబాయికి తీసుకొచ్చి భార్యకు అప్పగించారు. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. 

Leave a Comment