కట్నం కోసం.. నిశ్చితార్థం ఒకరితో.. పెళ్లి మరొకరితో..!

ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు.. కట్నం ఎక్కువిచ్చారని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. కట్నం కోసం మరో అమ్మాయిని మోసం చేయడంతో సీఆర్పీఎఫ్ జవాన్ పై కేసు నమోదైంది. కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గుంప్రమానుదిన్నె గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ మధుబాస్కర్ తో మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఓ యువతికి జనవరి 16న నిశ్చితార్థం అయింది. 

అయితే కట్నం ఎక్కువ వస్తుందని మధుభాస్కర్ బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన మరో యువతిని ఈనెల 15న పెళ్లి చేసుకున్నాడు. ఇదే న్యాయమని బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే ఎక్కవ కట్నం ఇచ్చారని సమాధానం ఇచ్చాడు. దీనిపై బాధిత యువతి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మహానంది ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 

Leave a Comment