వ్యక్తి సాహసం : భార్యా, కూతురును కాపాడుకునేందు చిరుతతో పోరాడి చంపేశాడు..

పులులు, సింహాలతో ఫైట్లు సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం.. తన వాళ్లను రక్షించుకునేందుకు హీరో వాటితో పోరాడుతాడు. అయితే కర్ణాటకలో ఓ వ్యక్తి నిజంగానే చిరుతతో పోరాడాడు. తన భార్యా, కూతురును కాపాడుకునేందుకు చోరుతతో పోరాడి దాన్ని హతమార్చాడు. 

హసన జిల్లాలోని భైరగొండనహళ్లి కొండ ప్రాంతంలో రాజగోపాల్ అనే వ్యక్తి తన భార్య, కుమార్తెతో బైక్ పై వెళ్తున్నాడు. ఆ సమయంలో వారిపై ఒక చిరుతపులి దాడి చేసింది. దీంతో ముగ్గురు ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఈక్రమంలో రాజగోపాల్ భార్య, కూతురు మీదకు చిరుత లంఘించే ప్రయత్నం చేసింది. 

వెంటనే అప్రమత్తమైన రాజగోపాల్ చిరుతపై విరుచుకుపడ్డాడు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని దానితో తలపడ్డాడు. చిరుత చేస్తున్న గాయాలతో ఒకవైపు శరీరం నుంచి రక్తం వస్తున్నా పట్టువిడవలేదు. చివరికి గోపాల్ ఆ చిరుతను చంపేసి అందరి ప్రాణాలు కాపాడుకున్నాడు. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా ఇదే చిరుత సోమవారం ఇద్దరిని గాయపరిచింది. 

 

Leave a Comment