‘హిమాలయన్ వయాగ్రా’ను ఇంట్లోనే సృష్టించాడు..!

ఇంటర్నెట్ లో ఎక్కువగా ఫాలో అయ్యే వారు ‘హిమాలయన్ వయాగ్రా’ గురించి వినే ఉంటారు.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మూలిక వార్తల్లో ఉంది.. ఎందుకంటే ఇది అంతటి ప్రయోజనాలను కలిగి ఉంటుంది..ఈ మూలిక ముఖ్యంగా హిమాలయాల్లో దొరుకుతుంది.. దీనిని లైంగిక సామర్థ్యం పెంచేందుకు ఉపయోగిస్తారు. లైంగిక సమస్యల చికిత్సల్లో, అనేక వ్యాధుల చికిత్సకు దీనిని వినియోగిస్తారు.. ఈ మూలక ధర అంతర్జాతీయ మార్కెట్ లో కిలో రూ.25 లక్షల వరకు పెలుకుతుంది.. దీనిని ‘కీడాజాడీ’ అని కూడా పిలుస్తారు.. లైంగిక పటుత్వం లేని వ్యక్తులకు చికిత్స కోసం 1000 ఏళ్ల కిందటే దీనిని వినిగించడం గమనార్హం..  

ఈ అరుదైన మూలిక సముద్ర మట్టానికి 3,600 నుంచి 5000 అడుగుల ఎత్తులో ఉండే ప్రాంతాల్లో లభిస్తుంది. ఇండియాలోని ఉత్తరాఖండ్ తో పాటు చైనా, భూటాన్, నేపాల్ హిమాలయ ప్రాంతాల్లో ఇది దొరుకుతుంది.. అంతటి విలువైన ‘హిమాలయన్ వయాగ్రా’ను హిమాచల్ ప్రదేశ్ కుల్లూకు చెందిన గౌరవ్ శర్మ ఇంట్లోనే సృష్టించాడు. ఇంట్లోనే ప్రయోగశాల ఏర్పాటు చేసి కృత్రిమంగా అభివృద్ధి చేశాడు.  ఇంట్లోనే చిన్నపాటి ప్రయోగశాలను ఏర్పాటు చేసి తొలిదశలో 3 వేల బాక్సుల ‘కీడాజాడీ’ని సాగు చేసినట్లు గౌరవ్ శర్మ పేర్కొన్నారు..   

 

 

Leave a Comment