టెక్నాలజీ వంటగదిని కూడా చాలా ఆధునికంగా మార్చేసింది. ఫలితంగా మిక్సర్ గ్రైండర్, మల్లీ కుక్కర్, శాండ్ విచ్ మేకర్, ఎగ్ బాయిలర్, డిష్ వాషర్, హ్యాండ్ బ్లెండర్ వంటి ఉపకరణాలు వంట గదిలోకి వచ్చేశాయి. వీటి ద్వారా వంట చాలా తేలికగా చేసుకోవచ్చు. అయితే ‘దోస ప్రింటర్’ లాంటిది కూడా మార్కెట్ లోకి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? కానీ వచ్చేసింది. సోషల్ మీడియాలో ఓ దోస ప్రింటర్ వీడియో వైరల్ అవుతోంది. ఓ ప్రింటర్ దోస తయారు చేసే వీడియోను ఓ యూజర్ షేర్ చేశారు.
దోసను తయారు చేసే ఈ ప్రింటర్ ని ఎవోచెఫ్ అనే కంపెనీ తయారు చేసింది. దీనికి దోస ప్రింటర్ అని పేరు పెట్టారు. వినియోగదారులు ఈ ప్రింటర్ ద్వారా దోస మందం, క్రిస్పినెస్ ని సెట్ చేసుకోవచ్చు. మీరు కేవలం పిండిని సిద్ధం చేసి, ఈ క్లాసిక్ స్టయిల్ ప్రింటర్ లో ఉంచాలి అంతే.. ఆ తర్వాత అది దోసను తయారు చేసి ఇస్తుంది. ఈ వీడియో చూస్తే ప్రింటర్ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది.
Dosa printer 😳 pic.twitter.com/UYKRiYj7RK
— Samantha /சமந்தா (@NaanSamantha) August 23, 2022