హత్రాస్ ఘటన : బాధితురాలి సామాజివ వర్గానికి చెందిన 236 మంది మత మార్పిడి..

హత్రాస్ లో యువతిని రేప్ చేసి హత్య చేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. హత్రాస్ ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలి సామాజిక వర్గానికి(వాల్మీకి) చెందిన 236 మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు.  అక్టోబర్ 14న ఘజియాబాద్ లోని కర్హేడా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

బాబా సాహెబ్ అంబేడ్కర్ ముని ముని మనవడు రాజరత్న సమక్షంలో 50 కుటుంబాలకు చెందిన 236 మంది బౌద్ధంలోకి మారారు. వీరందరు భారత బౌద్ధ సర్వసభ్య ధ్రువీకరణ పత్రం కూడా పొందారు. హత్రాస్ సంఘటన తమకు బాధ కలిగించిందని, నాయకులు, అధికారులు వారి బాధలు వినలేదని బౌద్ధ మతం స్వీకరించిన కుటుంబాలు ఆరోపించాయి. 

Leave a Comment