హార్దిక్ పాండ్యా తండ్రి మృతి..!

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హార్ధిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా మృతి చెందారు. శనివారం ఉదయం హిమాన్షు పాండ్యా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్నా కుటుంబ సభ్యులు వెల్లడించారు. హార్దిక్ సోదరుడు క్రుణాల్ పాండ్యా మాత్రం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

 తండ్రి మరణ వార్త విన్న క్రుణాల్ హుటాహుటీన అతను ఇంటికి పయనమయ్యాడు. ఇక త్వరలో ఇంగ్లండ్ తో సిరీస్  ఆరంభమయ్యే క్రమంలో హార్దిక్ పాండ్యా ట్రైనింగ్ సెషన్ లో ఉన్నాడు. హిమాన్షు మృతిపై బరోడా క్రికెట అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ పాండ్యా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

 

Leave a Comment