హ్యాపీ బర్త్ డే ‘వకీల్ సాబ్’.. మోషన్ పోస్టర్ అదిరింది..!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈరోజు తన 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. దీంతో ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో పవన్ బర్త్ డే సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది. 

  మరోవైపు పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ తో సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాన్ లాయర్ గా కనిపించబోతుండగా..నివేదా థామస్, అంజలి, అనన్యలు హిరోయిన్లుగా నటిస్తున్నారు.  

Leave a Comment