రియల్ హీరోకు హ్యాపీ బర్త్ డే..!

కరోనా కాలంలో ఏ హీరో చేయని సాయం చేస్తున్నాడు సోను సూద్. సినిమాల్లో విలన్ అయిన రియల్ లైఫ్ లో హీరో అనిపించుకుంటున్నాడు. ఎవరి ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నానంటూ చేయూతనిస్తున్నాడు. ఆపద్భాందవుడిలా ఆదుకుంటున్నాడు. లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలస కూలీలను బస్సులు ఏర్పాటు చేసి ఇళ్లకు చేర్చాడు.

ఈ రియల్ హీరో సోను సూద్ గురువారం తన 47వ పుట్టిన రోజు జరుపుకుటంటున్నాడు. దీంతో ఆయనకు అభిమానులు సెలబ్రిటీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ రియల్ హీరోకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. 

ఇక తన బర్త్ డే సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ వైద్య శిబిరాల ద్వారా 50 వేల మందికి సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. 

 

Leave a Comment