డబుల్ మర్డర్ కేసులో వ్యక్తికి ఉరి

నెల్లూరు : డబుల్‌ మర్డర్‌ కేసులో నెల్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2013లో జరిగిన తల్లీకూతుళ్ల హత్యకేసులో న్యాయస్థానం గురువారం తీర్పును వెల్లడించింది. నిందితుడు షేక్‌ ఇంతియాజ్‌కు ఉరిశిక్ష విధిస్తూ ఎనిమిదో అదనపు న్యాయమూర్తి సత్యనారాయణ తీర్పునిచ్చారు. కాగా హరినాథపురం 4వ వీధికి చెందిన దినకర్ రెడ్డి భార్య శకుంతలతో పాటు మెడిసిన్‌ చదువుతున్న కుమార్తె భార‍్గవిని ముగ్గురు దుండగులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే నగరంలోని వాగ్దేవి డి-ఫార్మసీ కళాశాల కరెస్పాండెంట్‌ దినకర్‌ రెడ్డి, స్థానిక హరనాథపురంలో భార్య, కుమార్తెతో నివాసం ఉండేవారు. ఆయన కుమార్తె భార్గవి ఎంబీబీఎస్‌ చదువుతోంది. 2013 ఫిబ్రవరి 12న దినకర్‌రెడ్డి నూతన గృహానికి సంబంధించిన ప్లాన్‌ ఇచ్చేందుకు వచ్చిన ముగ్గురు..శకుంతల, భార్గవిపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర రక్తగాయాలైన తల్లీకూతురు కిందపడిపోయారు. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

Leave a Comment