కేవలం ఫోన్ నంబర్ కోసం ఆత్మహత్యాయత్నం చేశాడు..!

సాధారణంగా ఎవరైనా యూజర్స్ కొంత కాలం సిమ్ కార్డ్ ను వాడకపోతే అది బ్లాక్ అయిపోతుంది. కంపెనీ ఆ నంబర్ గల సిమ్ కార్డును తిరిగి మార్కుట్ లోకి తెస్తుంది. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ.. తాజాగా అలా తన నంబర్ కోల్పోయిన ఓ వ్యక్తి దాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు బృందావన్ గార్డెన్ కు చెందిన ఓ యువకుడు ఓ నెట్ వర్క్ కి చెందిన సిమ్ కార్డును గత కొంత కాలంగా ఉపయోగిస్తున్నాడు. కొన్నాళ్లుగా బిల్ పే చేయకపోవడంతో సదరు కంపెనీ ఆ నెంబర్ ను డీఫాల్ట్ చేసింది. కొత్తగా నంబర్లు జారీ చేసే క్రమంలో ఆ నంబర్ జిల్లా పరిషత్ కార్యాలయానికి కేటాయించారు. 

ఇన తన సిమ్ నంబర్ పనిచేయకపోవడంతో ఆ యువకుడు తన నంబర్ వేరే వాళ్లకు జారీ అయిన విషయం తెలుసుకున్నాడు. జడ్పీ కార్యాలయానికి వచ్చి తన నంబర్ తనకు ఇవ్వాలని గొడవ చేశాడు. ఈ నంబర్ తమకు కంపెనీ వారు ఇచ్చారని ఉన్నతాధికారులు చెప్పినా వినలేదు. 

తన నంబర ఇవ్వాలని, లేకపోతు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. వెంట తెచ్చుకున్న డబ్బాలో కిరోసిన్ ను శరీరంపై పోసుకున్నాడు. దీంతో జడ్పీ కార్యాయలం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చింది. 

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆ యువకుడి చేతిలోని కిరోసిన్ డబ్బాను లాక్కున్నారు. అతడికి నచ్చజెప్పి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వివరాలు తెలుసుకున్నారు. ఈక్రమంలో తన నంబర్ ఇప్పించాలని పోలీసులపై ఒత్తిడి చేశాడు. దీంతో కంపెనీ వాళ్లకు చెప్పి మంచి ఫ్యాన్సీ నంబర్ ఇప్పిస్తామని సీఐ బుజ్జగించి పంపించారు. 

Leave a Comment