అత్తతో గొడవ.. చపాతీ కర్రతో కొట్టి చంపిన కోడలు..!

112
Guntur News

కొన్ని ఇళ్లల్లో అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుతుంటాయి. తన మాటే నెగ్గాలన్న అత్తలు పెత్తనం చెలాయిస్తుంటారు. అయితే కోడళ్లకు నచ్చక ఇద్దరి మధ్య గొడవు జరుగుతుంటాయి. కొందరు అత్తలు అయితే కోడళ్లకు చిత్రహింసలకు గురిచేస్తుంటారు. ఈ హింసను భరించలేని ఓ కొడలు క్షణికావేశంలో అత్త ప్రాణాలే తీసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు తెనాలి పట్టణానికి చెందిన తాడికొండ బద్రీ నారాయణ గుప్తా, మైథిలీ(52) దంపతులు బంగారు వ్యాపారం చేస్తారు. వీరికి నవీన్ కుమార్ గుప్తా అనే కుమారుడు ఉన్నాడు. నవీన్ కు రెండేళ్ల క్రితం కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన రాధా ప్రియాంక అనే అమ్మాయితో పెళ్లి జరగింది. వీరికి ఏడాది కొడుకు ఉన్నాడు. 

అయితే పెళ్లి అయినప్పటి నుంచి అత్తాకోడళ్లకు తరుచూ గొడవులు జరుగుతుండేవి. కోడలితో గొడవ పడినప్పుడల్లా తాను ఆత్మహత్య చేసుకుంటానని అత్త బెదిరించేది. ఎప్పుడు తన మాటే నెగ్గాలన్న అత్త మాట కోడలికి నచ్చేది కాదు. దీంతో అత్తపై గొడవకు దిగేది. ఈక్రమంలో ఆగస్టు 28న ఉదయం అత్తాకోడళ్లకు మళ్లీ గొడవ జరిగింది. కోపంతో కోడలు తన చేతులను చాకుతో కోసుకునే ప్రయత్నం చేసింది. భర్త, మామ ఆమెను అడ్డుకున్నారు. ఇక అత్త కూడా తాను ఇంట్లో ఉండనని బయటకు వచ్చేసింది. దీంతో భర్త కంగారుపడి ఆమెను తన గోల్డ్ షాపుకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. 

అయితే అత్తాకోడళ్లు మళ్లీ గొడవకు దిగారు. దీంతో అత్త మైథిలీ నిద్రమాత్రలు వేసుకుని తన గదిలోకి వెళ్లింది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుమారుడికి మెసేజ్ చేసింది. గొడవలతో విసిగిపోయిన కోడలు రాధా ఎలాగైనా అత్తను చంపాలని నిర్ణయించుకుంది. అత్త గదిలోకి వెళ్లి కత్తితో తల, గుండెలు, పొట్టపై పొడిచింది. చపాతీ కర్రతో తలపై బలంగా కొట్టింది. కొద్దిసేపటికి మైథిలీ ప్రాణాలు విడిచింది. కోడలు ప్రియాంకను పోలీసులు అరెస్టు చేశారు. 

Previous articleఇండియన్స్ టాయిలెట్స్ కడుక్కునే విధానంపై కామెంట్ చేసిన విదేశీయుడికి అదిరిపోయే కంటౌర్ ఇచ్చిన అమ్మాయి..!
Next articleఅక్కడ రూపాయికే ఇడ్లీ..16 ఏళ్లుగా ఇదే ధర.. హ్యాట్సాఫ్ రాంబాబు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here