17 నిమిషాల్లో పెళ్లి.. కట్నంగా రామాయణ గ్రంథం కోరిన వరుడు..!

పెళ్లి అంటే ఆర్భాటం.. పేదలు, ధనికులు అనే తేడా లేకుండా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.. కానీ ఉత్తరప్రదేశ్ షాజహన్ పూర్ లో జరిగిన పెళ్లి వేడుక మాత్రం చాలా నిరాడంబరంగా జరిగింది. కేవలం 17 నిమిషాల్లోనే పెళ్లి తంతు ముగిసింది..ఇక కట్నంగా వరుడు ఏం కోరాడో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఆ పెళ్లి కొడుకు కట్నంగా రామాయణ గ్రంథాన్ని ఇవ్వాలని కోరాడు. అది కూడా తన బావ మరుదులకు ఇష్టమైతేనే ఇవ్వాలన్నారు. 

షాజహన్ పూర్ కు చెందిన పుష్పేంద్ర దూబేకు స్థానికంగా ఉన్న ప్రీతి తివారితో పెళ్లి నిశ్చయమైంది. పుష్పేంద్ర మాత్రం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో పెళ్లి కుమార్తె, మరి కొందరు అతిథులను తీసుకుని పట్నా దేేవి కాళి ఆలయానికి నడుచుకుంటూ వెళ్లాడు. ఆలయం చుట్టూ 7సార్లు ప్రదిక్షణ చేసి వధువు మెడలో తాళి కట్టాడు.

కట్నంగా రామాయణం గ్రంథాన్ని ఇవ్వమన్నాడు.. కట్నం కారణంగా ఎంతో మహిళల జీవితాలు నాశనం అవుతున్నాయని, అందుకే కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నామని నూతన దంపతులు తెలిపారు. తమను చూసి కొందరైనా మారితే ఎంతో సంతోషిస్తామని చెప్పారు. 

Leave a Comment