కేరళలో చిన్న చిన్న సైజులో కోడి గుడ్లు..వైరల్ అవుతున్న వెరైటీ గుడ్లు..!

కోడి గుడ్డు  ఒక గుండ్రాకారం లేదా వర్తులాకారపు శరీరం, కోడి పెట్టే గుడ్డు కాబట్టి దీనికి కోడి గుడ్డు లేదా కోడి గ్రుడ్డు అని వ్యవహరిస్తాం. సాధారణంగా పక్షి గుడ్లలో కనిపించే ప్రధాన నిర్మాణమే కనిపిస్తుంది. అండము, దీని చుట్టూ పొరలు బాహ్యగోడ. ఈ గ్రుడ్డులో పచ్చసొన, తెల్లసొన వుంటాయి.

ప్రజలు కోడిగుడ్లను ఆహారపదార్థంగా వాడకము అనాదినుండి వస్తున్నది. ఇవి మంచి పోషక పదార్థాలు ప్రొటీనులు, కొలైన్లు కలిగివుండడం దీనికి కారణము.

కేరళ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతకుముందు బాగానే కోడి గుడ్లు పెట్టేదని..కొద్ది రోజులుగా చిన్న చిన్న సైజులో గుడ్లు పెడుతోందని కోడి యజమాని సమద్ తెలిపారు. అదేంటి చిన్న సైజు గుడ్లులాగా ఉన్నాయి. పక్కనే పెద్దగా ఉన్న గుడ్డు ఉన్నది ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారు. ఇవి ఓ కోడిపెట్ట పెట్టిన గుడ్లు. వింత వింత సైజుల్లో గుడ్లు పెడుతోంది. ఐదేళ్ల వయస్సున్న ఈ పెట్ట…ద్రాక్ష పండంత సైజులో కోడిగుడ్లు పెడుతోంది. బుజ్జి బుజ్జిగా ఒకటి..మరొకటి పెద్ద సైజులో ఈ గుడ్లున్నాయి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఈ గుడ్లలో కేవలం తెల్లసొన మాత్రమే ఉంటోంది.

ఇంట్లో ఉన్న మిగతా కోళ్లకు ఏ ఆహారం పెడుతున్నామో..అదే ఆహారం ఈ కోడిపెట్టకు కూడా పెడుతున్నామన్నారు కోడి యజమాని సమద్. అయినా..వింత వింత సైజులో ఇప్పటి దాక 9 గుడ్లు పెట్టిందన్నారు. చిన్న గుడ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో…వాటిని చూసేందుకు జనాలు సమద్ ఇంటికి వస్తున్నారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుడ్లు రకరకాల రంగుల్లో ఉంటాయి. కోడి ఉత్పత్తి చేసే పిగ్మెంట్ కారణంగా గుడ్డు రంగు మారుతుంది. అంతేకానీ గుడ్డు ఏ రంగులో ఉన్నా అందులోని పోషక విలువలేమీ మారవు. బ్రౌన్ ఎగ్ అయినా, వైట్ ఎగ్ అయినా ఆరోగ్యకరమే.

కోడి గుడ్డులో ప్రోటీన్లు అధికం. కాబట్టి కొలెస్ట్రాల్‌ భయంతో దీన్ని పక్కనపెట్టడం సరికాదు. కొవ్వుల్లోనూ మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాలున్నాయి. రోజుకు రెండు ఎగ్ వైట్‌‌లను తింటే శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. పిల్లలు, యువకులు ఎలాంటి భయం లేకుండా గుడ్లను లాగించేయొచ్చు. వయసు పెరిగే కొద్దీ జీర్ణశక్తి మందగిస్తుంది. 40 ఏళ్లు దాటిన వారిలో బీపీ, కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మాంసాహారం తినేవారు నిస్సంకోచంగా వారానికి 3-4 గుడ్లు తినొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

ఆరోగ్యవంతులు రోజుకు మూడు గుడ్ల వరకూ తినొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక్రటెండు గుడ్లు తింటే శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.

 

Leave a Comment