ఒకే స్కూల్ లో తాత, తండ్రి, మనవడు..!

ఈ కాలంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. ఇక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులైతే తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ లలో చదివిస్తున్నారు.. కాని ఇక్కడ మాత్రం తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే పాఠశాలలో పనిచేయడం, అంతకుమందు వారు అదే స్కూల్ లో చదవడం, ఇక మూడో తరాన్ని కూడా ఆ పాఠశాలలోనే చదివిస్తున్నారు. ఇది ఎంతో అరుదైన విషయం.. అదీ ప్రభుత్వ పాఠశాల కావడం ఇంకా విశేషం.. 

విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కొత్తూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఈ అరుదైన విశేషానికి వేదిక అయింది. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ ఇ.మల్లేశ్వరరావవు. ఆయన 1968 నుంచి 1973 వరకు ఇక్కడే చదువుకున్నారు. 1986లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరి పలు పాఠశాలల్లో పనిచేశారు. ఈ ఏడాది ఎ.కొత్తూరుకు ప్రధానోపాధ్యాయుడిగా బదిలీపై వచ్చారు. ఆయన కుమారుడు దుర్గా ప్రవీణ్ ఈ పాఠశాలలోనే 1994 నుంచి 1999 వరకు చదువుకున్నారు. 2010లో ఉపాధ్యాయునిగా ఉద్యోగం సాధించి ఈ ఏడాది ఇదే పాఠశాలకు బదిలీ అయ్యారు. ఇప్పుడు తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువు చెబుతున్నారు. ఇప్పుడు దుర్గా ప్రవీణ్ తన కుమారుడు శివ అనిరుధ్ ని కూడా ఇదే పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. ముగ్గురు కూడా ఒకేసారి పాఠశాలకు వచ్చి వెళ్తుండటం తమకెంతో ఆనందంగా ఉందని వీరు చెబుతున్నారు. 

Leave a Comment